E-Paper
Advertisement

అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!

అగ్నివీర్ గా టాలీవుడ్ విలన్ కూతురు!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. అలాగే హోదా ఉన్నప్పుడే తమ వారసులకు ఒక స్థానం కల్పించాలని చూస్తూ ఉంటారు.. అందులో భాగంగానే ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్లో కొనసాగుతున్న సమయంలోనే తమ వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. తమ బాధ్యతలను దింపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సెలబ్రిటీల వారసులు కొంతమంది ఇండస్ట్రీలోకి వస్తుంటే.. ఇక్కడ ఒక టాలీవుడ్ విలన్ కూతురు మాత్రం అందరికంటే భిన్నంగా భారతదేశానికి సేవ చేయడం కోసం అగ్నివీర్ గా మారింది. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారత సైన్యంలోకి చేరిన రవికిషన్ కూతురు..

ప్రముఖ టాలీవుడ్ విలన్ ‘రేసుగుర్రం’ సినిమాతో విలన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన రవి కిషన్ (Ravi Kishan) కూతురు ఇషిత శుక్లా (Ishita Shukla). భారతదేశానికి సేవ చేయడం కోసం సైన్యంలోకి వెళ్ళింది. అందరి సెలబ్రిటీల వారసులాగా కాకుండా ఇషిత చాలా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తన తండ్రి లాగా కాకుండా డిఫరెంట్ కెరియర్ను ఎంచుకుంది. అగ్నివీర్ గా రక్షణ దళంలోకి చేరింది. నిజానికి ఇషిత శుక్లాకి చిన్న వయసులోనే ఆర్మీలో పనిచేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్ కి వెళ్లకుండా ఎన్. సీ.సీ లో చేరింది. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమయ్యింది. ఢిల్లీ డైరెక్టరేట్ కు చెందిన సెవెన్ గర్ల్స్ బెటాలియన్ లో కూడా ఈమె పని చేశారు.

Advertisement

also read:ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

అగ్నివీర్ గా భారత సైన్యంలోకి..

కర్తవ్య పథ్ లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా ఆమె శిక్షణ తీసుకున్నారు. ఇకపోతే ఈమె 2023లో అగ్నివీర్ గా చేరినట్లు తెలుస్తోంది. ఆమె నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు.. ఏది ఏమైనా అందరిలాగా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని దేశసేవ కోసం ఇషిత భారత సైన్యంలోకి చేరడంతో ఆమె పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

రవి కిషన్ సినిమా కెరియర్..

Advertisement

రవి కిషన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈయన.. 2019 నుండి గోరఖ్పూర్ లోకసభ పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. పార్లమెంటరీ విధులలో ఆయన పనితీరును మెచ్చిన ప్రభుత్వం ఆయనకు 2025లో సంసద్ రత్న పురస్కారాన్ని అందించింది. ఇక నటుడిగా భోజ్ పురి , హిందీ చిత్రాలతో పాటు తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 200 లకు పైగా చిత్రాలలో కనిపించారు. 1992లోనే పితాంబర్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. హిందీలో ఎన్నో చిత్రాలలో నటిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగులో రేసుగుర్రం, సుప్రీం, కిక్ 2, రాధ, ఎమ్మెల్యే, సైరా నరసింహారెడ్డి, హీరో, డాకు మహారాజ్, పెద్ది ఇలా ఎన్నో చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా మారిన ఈయన టెలివిజన్ సీరియల్స్ లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
.

Related News

మల్టీస్టారర్ కు వెంకీ మామ సిద్ధం.. డైరెక్టర్ ప్లానింగ్ ఇదా..?

యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

Big Stories

Advertisement
×