E-Paper
Advertisement

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?
Advertisement

Actress Roja:ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా (R.K.Roja )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించింది. ఇక రాజకీయాల్లోకి వెళ్లిన ఈమె..అక్కడ మినిస్టర్ గా కూడా పనిచేసి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యింది. మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన రోజా.. అక్కడ గెలుపొందలేదు. దీంతో మళ్ళీ ఇండస్ట్రీ బాట పట్టిన విషయం తెలిసిందే . అలా ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తున్న ఈమె.. మరొకవైపు తన సినిమాల ద్వారా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే కోలీవుడ్ లో ఇటీవల ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీఎంట్రీ మూవీ..

అదేదో కాదు తమిళంలో ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘అన్బే డయానా’.. పారి ఎలావళగన్ హీరో కం డైరెక్టర్ గా పనిచేయగా.. రమ్య రంగనాథన్ హీరోయిన్గా నటించారు. జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు ఈ నెల అనగా ఆగస్టు 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక అభిమానులకు మరో సర్ప్రైజ్ ఏమిటంటే ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ ,మలయాళం భాషలలో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రోజా రీ ఎంట్రీ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతుందని తెలిసి అభిమానులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

also read:యంగ్ హీరోతో నాగదుర్గ ప్రత్యేక పూజలు.. ప్రేమలో పడ్డారా?

అన్బే డయానా మూవీ స్టోరీ..

రోజా రీ ఎంట్రీలో భాగంగా వచ్చిన ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కృష్ణ ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో – ఇండియన్ అమ్మాయి డయానాతో ప్రేమలో పడతాడు. డయాన ఫ్రీ బర్డ్. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానా పద్ధతులు నచ్చకపోవడంతో డయానాతో ప్రేమకు కృష్ణా తల్లి సరళ (ఆర్కే రోజా) అడ్డుపడుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది ?అనేది మిగతా స్టోరీ. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతుందని చెప్పవచ్చు.

రోజా కెరియర్.

Advertisement

రాజకీయాల నుండి ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీలోకి మకాం మార్చిన ఈమె ఒకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. అలా ప్రముఖ న్యూస్ ఛానల్ వేదికగా ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ షోలో హీరో శ్రీకాంత్, డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తోంది . ఇక సరైన కథ దొరికితే మళ్ళీ తాను నటించడానికి సిద్ధమే అని నిరూపిస్తోంది సీనియర్ హీరోయిన్ రోజా.

Related News

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్‌కి ఇంత ఘోరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందా? ఈ మూవీని డోంట్ మిస్

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు

25 ఏళ్లుగా ప్రాణాలతో చెలగాటం… జాకాస్ గ్యాంగ్‌కు ఎమోషనల్ ఫేర్‌వెల్

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

Big Stories

Advertisement
×