E-Paper
Advertisement

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!
Advertisement

Ranabaali First Documentary: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి(Ranabaali). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు డాక్యుమెంటరీలను విడుదల చేస్తూ సరికొత్తగా ప్రమోషన్లను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే ఇలా నాలుగు డాక్యుమెంటరీలుగా ఈ సినిమా కథ ఏంటో ప్రేక్షకులకు ముందుగానే చెప్పే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా..

ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి నాలుగు భాగాలలో మొదటి భాగం ” ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్” (The Famine we Forgot)అని భాగాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా కథకు మూలం ఏంటి విషయాల గురించి డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్, రష్మిక మందన్న (Rashmika Mandanna),విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమా సుమారు 150 సంవత్సరాల క్రితం జరిగిన ఒక నిజ జీవిత కథ ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityn)తెలిపారు.

రాయలసీమ ప్రాంతంలో కరువు…

Advertisement

ఈ సినిమా కోసం తాము ఎన్నో ప్రాంతాలకు వెళ్ళామని బళ్ళారి మద్రాస్ వంటి ప్రదేశాలకు వెళ్లి రీసర్చ్ చేశామని, అలాగే ఎన్నో కలెక్టర్ ఆఫీసులకు వెళ్లి పాత రికార్డులను పరిశీలించిన అనంతరం ఈ కథను సిద్ధం చేశామని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమా కథ 1876- 78 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో రాయలసీమ పరిధిలో జరిగిన భయంకరమైన కరువు, ప్రజల ఆకలి కేకలు, వలస పాలకుల దోపిడీ వంటి యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ ఎపిసోడ్ రూపొందించారు. ఇలా ఈ సినిమాకు సంబంధించి నటీనటులతో పాటు డైరెక్టర్ పలు విషయాలు తెలిపారు.

Advertisement

ఇలా ఈ సినిమా నుంచి మొదటి డాక్యుమెంటరీగా విడుదల చేసిన ఈ సిరీస్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మిగిలిన మూడు సిరీస్ లను వరుసగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దసరా పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మొదటిసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో రష్మిక జయమ్మ పాత్రలో కనిపించగా విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు.

Also Read: నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!

Big Stories

Advertisement
×