Actress Anjali: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న వారిలో నటి అంజలి ఒకరు. ఈమె ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా బ్యాచిలర్ గానే కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అంజలి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. తన పెళ్లికి సంబంధించి అంజలి(Anjali) తరచు సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. పలానా హీరోతో రిలేషన్ లో ఉన్నారని బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా గతంలో కూడా తన పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చిన అంజలి తాజాగా తన పెళ్లి రూమర్ల గురించి మరోసారి కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఈమె నివిన్ ఫౌలి, సూరీలతో కలిసి ఏళు కడల్ ఏళు మలై సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా సంచారి(Sanchari) పేరుతో తెలుగులో అక్టోబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .ఈ నేపథ్యంలోనే ఈమె హైదరాబాదులో పలు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు కావడంతో అంజలి ఈ వార్తల పట్ల స్పందిస్తూ.. ప్రస్తుతానికి తనకు పెళ్లిపై ఏ విధమైనటువంటి ఆలోచన లేదని తెలిపారు. అలాగే నాపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. పెళ్లి అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని నాకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చారు. అయినా నా పెళ్లి విషయంలో అందరికీ ఎందుకు అంత ఆత్రుత నాకర్థం కావడం లేదని తెలిపారు. నిజానికి నా పెళ్లి గురించి నాకంటే కూడా నా స్నేహితులే చాలా ఆసక్తి చూపుతున్నారని ఈమె తెలిపారు.
నేను పెళ్లి చేసుకుంటే వాళ్లందరూ కొత్త డ్రెస్సులు వేసుకొని అందంగా తయారయ్యి ఫోటోషూట్లు తీయించుకోవడం, సరదాగా గడపడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంజలి తెలిపారు.. ఇలా పెళ్లి గురించి అంజలి స్పందిస్తూ క్లారిటీ ఇవ్వడంతో ఈమె పెళ్లి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయ్యింది. ఇక ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ చెన్నైలో స్థిరపడి అక్కడే చదువులను కొనసాగించడంతో తమిళ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా అంజలి బిజీగా ఉన్నారు.
Also Read: కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!