E-Paper
Advertisement

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!
Advertisement

Slum Dog: డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(PuriJagannadh) దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటిస్తున్న తాజా చిత్రం “స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్”(Slum Dog). ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుంది. ఇకపోతే ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ పలు అప్డేట్స్ ఇవ్వగా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ నటి జరీనా వాహబ్ (Zarina Wahab)ను పరిచయం చేస్తూ చిన్నపాటి గ్లింప్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి…

ఇందులో భాగంగా నాంపల్లి స్టేషన్ వెళ్లి ట్రైన్ కింద తలపెట్టి చనిపోవాలనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు అనే డైలాగ్ తో ఈ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ఈ ఆకలి ముందు అన్ని ఓడిపోతాయి రా.. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్నీ మంటకలిసిపోతాయి.నాకు తెలియకుండానే నా చేతులు అడుక్కోవడం మొదలుపెట్టాయి అంటూ నటి జరీనా ఎమోషనల్ డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. ఇక చివరిలో పూరి జగన్నాథ్ వాయిస్ తో “అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు”  వంటి డైలాగ్ ఈ గ్లింప్స్‌ లో హైలెట్ అయింది. ఇలా నటి జరీనా జుబేదా అనే పాత్రలో నటిస్తోంది అంటూ పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

మదర్ సెంటిమెంట్ తో స్లమ్ డాగ్…

Advertisement

ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే మాత్రం ఈ సినిమా మదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇదివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, లోఫర్ వంటి సినిమాలు మదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్ మరోసారి మదర్ సెంటిమెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఈ సినిమాలో విజయ్ సేతుపతి జోడిగా నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సీనియర్ నటి టబు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే ఈయన రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరిచింది. మరి స్లమ్ డాగ్ పూరి జగన్నాథ్ కు స్ట్రాంగ్ కం బ్యాక్ అవుతుందా? లేదా,? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: రూ.15 లక్షలకే ఎందుకు టెంప్ట్ అయ్యావు.. మిథిలేష్ కు ఇచ్చిపడేసిన శివాజీ!

Related News

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!

అర్ధరాత్రి ఆలయంలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు..

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×