Ramcharan Thanks Doctors: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan tej) ఇటీవల కోయంబత్తూర్ లోని గంగా హాస్పిటల్(Ganga Hospital) లో తన చేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. పెద్ది సినిమా షూటింగ్లో భాగంగా ఆయన ప్రమాదానికి గురి కావడంతో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన అనంతరం రామ్ చరణ్ తన చేతికి సర్జరీ చేయించుకున్నారు. ఇటీవల తన చేతిలో అమర్చిన రాడ్ కూడా తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా తన సర్జరీ విజయవంతం కావడంతో ఈయన గంగా హాస్పిటల్ వైద్య బృందానికి అక్కడ స్టాప్ మొత్తాన్ని ప్రస్తావిస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా గంగా హాస్పిటల్ వైద్యులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..చికిత్సా ప్రక్రియలో తమ నైపుణ్యం, శ్రద్ధ, అంకితభావంతో సేవలందించిన డాక్టర్ ఎస్. రాజా సబాపతి, డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ ప్రవీణ్ భారద్వాజ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హాస్పిటల్‌లోని మొత్తం వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి వైద్యుడు, నర్సు, సిబ్బంది ఎంతో ఆప్యాయతతో నన్ను చూసుకున్నారు. వారు అందించిన శ్రద్ధ, సంరక్షణను నేను ఎప్పటికీ మర్చిపోలేను నిజంగా మీ అందరికీ తాను కృతజ్ఞుడిని అంటూ రాంచరణ్ అక్కడ వైద్యులకు అలాగే ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
ఇకపోతే ప్రతిష్ఠాత్మకమైన నాస్ (NASS) ఔట్‌స్టాండింగ్ రీసెర్చ్ పేపర్ అవార్డును ఐదోసారి అందుకున్నందుకు గంగ హాస్పిటల్ వైద్య బృందంపై హర్షం వ్యక్తం చేశారు. వైద్య పరిశోధన రంగంలో గంగా హాస్పిటల్ సాధిస్తున్న విజయాలకు ఈ పురస్కారం నిదర్శనమని, వైద్య రంగంలో అసాధారణ ప్రతిభకు, అంకితభావానికి దక్కిన గుర్తింపు అంటూ చరణ్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
My heartfelt gratitude to Dr. S. Raja Sabapathy, Dr. S. Rajasekaran and Dr. Praveen Bharadwaj of the Ganga Hospital for their expertise, care, and dedication throughout the procedure.
A special thank you to the entire team at Ganga Hospital for the exceptional care and… pic.twitter.com/ieNGaSncKT
— Ram Charan (@AlwaysRamCharan) September 28, 2026
ఇక రామ్ చరణ్ చెయ్యి గాయం పూర్తిగా నయమైందని తెలుస్తుంది. అయినప్పటికీ రెండు నెలలపాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. ఇలా రెండు నెలల పాటు ఫిజియోథెరపీ చేయించుకోమని సూచించడంతో రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని పూజ కార్యక్రమాలతో షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.
Also Read: బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!