E-Paper
Advertisement

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..బలవంతపు ప్రేమ అక్కర్లేదు.. రాశి ఖన్నా
Advertisement

Raashii khanna: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా (Raashii khanna) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది స్టార్ హీరోలతో జత కట్టిన రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది. చివరిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కీలక పాత్ర పోషించి , ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశిఖన్నా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.

బాధ వచ్చినప్పుడు అనవసరంగా పోరాడకూడదు – రాశి ఖన్నా

అయితే అక్కడ బిజీగా ఉన్నా.. ఇక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపెన్ గా మనసులో మాటలను నిర్భయంగా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. చిట్ చాట్ సెషన్ లో భాగంగా ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ..”మీరు ఒంటరిగా ఉన్నప్పుడు.. ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఏం చేస్తారు?” అని ప్రశ్నించారు. దీనికి రాశిఖన్నా మాట్లాడుతూ.. “ఒంటరితనం అనిపించినప్పుడు.. ఆ ఒంటరితనాన్ని నేను దాచుకోకుండా పూర్తిగా అనుభవిస్తాను. దానివల్ల ఒకవేళ నా కళ్ళల్లో నీళ్లు వచ్చినా సరే ఆపుకోను.. ఆ భావాలను అణచివేయను .. అనవసరంగా వాటితో పోరాడను” అంటూ ఆమె స్పష్టం చేసింది.

ప్రేమ అంటే కంట్రోల్ చేయడం కాదు.. స్వేచ్ఛనివ్వడం..

Advertisement

ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిన బోధనలపై తన అభిప్రాయాన్ని కూడా ఈమె పంచుకుంది. నేను ఆయన దగ్గర్నుంచి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మధ్యకాలంలో ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో మధ్యలో బ్రేకప్ అంటూ విడిపోతున్నారు. దీనికి కారణం ఈగో.. ఒకరిపై ఒకరు అధికారం చెలాయించడమే. అయితే నేను ఆయన నుంచి ఇదే విషయంపై ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను . ప్రేమ అంటే ఎవరిని కంట్రోల్ చేయడం కాదు.. ఎదుటి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనివ్వడమే.. ఎప్పుడైతే ప్రేమ స్వచ్ఛమైన స్వేచ్ఛను అందుకుంటుందో అదే అసలైన ప్రేమ అవుతుంది. బలవంతపు ప్రేమ ఎవరి నుంచి పొందాల్సిన అవసరం లేదు..

also read: ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు..

Advertisement

ఒకరిని మనం ప్రేమిస్తున్నామనే కారణంతో అవతలి వాళ్లను మనతోనే ఉండాలని ఎప్పుడూ బలవంతం చేయకూడదు. మనం చెప్పినట్టే వినాలని హుకుం జారీ చేయకూడదు. అవతలి వ్యక్తులకు కూడా సొంత నిర్ణయాలు ఉంటాయి. వారిని కూడా ఆ సొంత నిర్ణయాలు తీసుకోనివ్వాలి. అదే సమయంలో మనం కూడా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎదుగుతూనే ఉండాలి . అదే అసలైన ప్రేమ బంధం అంటూ తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నారు. మొత్తానికి అయితే రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరినీ ఈ మాటలు ఆలోచింపచేసాయి అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

150 ఏళ్ల నాటి నిజ జీవిత కథ..రణబాలి ఫస్ట్ సిరీస్ డాక్యుమెంటరీ రిలీజ్!

పెళ్లి పై ఓపెన్ అయిన అంజలి..అంత ఆత్రుత ఎందుకో అంటూ?

కంప్లైంట్ చేసింది భక్తిపై కాదు.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్!

అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు..మదర్ సెంటిమెంట్ తో ‘స్లమ్ డాగ్ ‘ గ్లింప్స్!

రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. బయటపడ్డ నమ్మలేని నిజాలు!

ఫేక్ అకౌంట్..మోసపోవద్దు..ఫ్యాన్స్ కు దుల్కర్ రిక్వెస్ట్!

మనకీ వాళ్లకీ తేడా ఏంటి? ఆ హీరో వివాదం వేళ సూర్య హితవు!

Big Stories

Advertisement
×