Allu Sirish: అల్లు శిరీష్ ఇటీవల వినాయక చవితి నవరాత్రి వేడుకలలో భాగంగా డీజే నిర్వహించడంపై సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. గణేష్ నవరాత్రులు ముగిసినప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు డీజే పాటలు పెడుతూ ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో అల్లు శిరీష్ (Allu Sirish)ఈ విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేక్‌పేట్ అపర్ణ వన్ అపార్ట్‌మెంట్స్ ప్రాంతంలో ఉంటున్న అల్లు శిరీష్, సమీపంలోని వినోభానగర్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అర్ధరాత్రి 2 నుండి 3 గంటల వరకు పెద్ద శబ్దాలతో లౌడ్ స్పీకర్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈయన తెలిపారు.ఈ విధంగా ఈయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అల్లు శిరీష్ మరొక పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల పట్ల అల్లు శిరీష్ స్పందిస్తూ తాను పోలీసులకు కంప్లైంట్ చేసింది భక్తిపై కాదని, సామాజిక స్పృహ పై మాత్రమేనని ఈయన క్లారిటీ ఇచ్చారు. తాను కూడా హనుమంతుడి భక్తుడేనని, అర్ధరాత్రి రెండు గంటల వరకు డీజే పాటలు పెట్టడం భక్తి అనిపించుకోదు..సివిక్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది దీనిని అందరూ పాటిస్తే ఇలాంటి కంప్లైంట్ చేసే అవసరం ఉండదని అల్లు శిరీష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇక అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేయగా అల్లు శిరీష్ కు ఊహించని షాక్ తగిలింది. అల్లు శిరీష్ ఫిర్యాదులో హనుమాన్ టెంపుల్ లో పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు కానీ అది హనుమన్ టెంపుల్ కాదని పోలీసులు తేల్చి చెప్పారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా డీజే సౌండ్ పెట్టారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఇదే విషయం గురించి మరొక నటి రేణు దేశాయ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.
Friends.. I am religious myself and pray to Lord Hanuman. Blasting music with DJ setup at 2am is not Bhakti. What I complained is abt civic sense not devotion. Thank you for understanding.. pic.twitter.com/frOgcSl09m
— Allu Sirish (@AlluSirish) September 28, 2026
రెండు రోజుల క్రితం ఈమె కూడా అర్ధరాత్రి వరకు గణేష్ మండపాల ముందు ఇలా డీజే శబ్దాలతో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా రేణు దేశాయ్ సైతం ఇదే అంశం గురించి మాట్లాడటంతో ఆమెపై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొంతమంది రేణు దేశాయ్ పట్ల దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. బూతులు తిడుతూ చచ్చిపో అంటూ ఆమెకు శాపనార్థాలు పెడుతున్నారని రేణు దేశాయ్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అల్లు శిరీష్ సైతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Also Read: ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. ఎప్పుడంటే?