Sathyaraj on Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల యోగాంధ్ర కార్యక్రమాన్ని ముగించుకొని తమిళనాడులో జరిగిన “మురుగన్ మానాడు” కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంపై నటుడు సత్యరాజ్ (Sathyaraj)కీలక వ్యాఖ్యలు చేశారు. వీసీకే పార్టీ కార్యక్రమంలో సత్యరాజ్ మాట్లాడుతూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కి వార్నింగ్ ఇచ్చారు. “దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని” సత్యరాజ్ తెలిపారు. “మురుగన్ మానాడు పేరుతో..పెరియార్ సిద్ధాంతాల్ని నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరని, తమిళ ప్రజలు తెలివైన వారు అని, తమిళనాట మీ ఆటలు సాగవు అని, మురుగన్ మానాడు పేరుతో మమ్మల్ని మోసం చేశారని అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమవుతుందని” విమర్శలు గుప్పించారు సత్యరాజ్ . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
‘మురుగన్ మానాడు’ సభలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
గత రెండు రోజుల క్రితం తమిళనాడులోని మధురై లో మురుగన్ మానాడు సభకు హాజరయ్యారు పవన్ కళ్యాణ్. మహాసభలో మాట్లాడుతూ.. నాస్తికులు, సెక్యులరిస్టులపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అధికార డిఎంకె పార్టీని విమర్శించడంతోపాటు హిందువులు, సనాతన ధర్మం గురించి తన పాత వాదనలను ఆయన మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” నాస్తికులకు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే.. నాస్తికులు హిందువులను ఎంచుకొని లక్ష్యంగా చేసుకుంటున్నారు” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు తమిళ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయని చెప్పవచ్చు.
శాంతిభద్రతలకు పవన్ విఘాతం కలిగించారా?
నిజానికి తమిళనాడు ద్రవిడ ఉద్యమాలకు, హేతువాద భావజలానికి పుట్టినిల్లు లాంటిది. రామస్వామి వంటి నాయకులు కూడా మతాతీత భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో కీలక పాత్ర వహించారు. అలాంటి రాష్ట్రంలో దైవం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందడం ఏంటని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తమిళనాడులో మత ఘర్షణలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని పలువురు మంత్రులు కూడా ఆరోపణలు చేయగా.. ఈ నేపథ్యంలోనే సత్యరాజ్ కూడా పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది.
నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు..
దీనిపై కొంతమంది సత్యరాజ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మతకల్లాలు సృష్టించే మాటలు అక్కడ మాట్లాడవలసిన అవసరం పవన్ కళ్యాణ్ కి ఏముందని విమర్శిస్తుంటే.. మరికొంతమంది సత్యరాజ్ ఇలా తన అభిప్రాయాలను బహిరంగంగా మాట్లాడడం సరికాదని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్, సత్యరాజ్ మధ్య వివాదం ముదిరేలా ఉందని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.