Ajay Devgan Raid 2 OTT..బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ దేవ్ గణ్ (Ajay Devgan). ప్రస్తుతం హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రైడ్ 2’. దాదాపు 5 సంవత్సరాల క్రితం వచ్చిన ‘రైడ్’ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమయ్యింది.
థియేటర్లలో సంచలనం సృష్టించిన రైడ్ 2..
రాజ్ కుమార్ (Raj Kumar) దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్,రితేష్ దేశ్ ముఖ్ (Ritesh Deshmukh), రజత్ కుమార్(Rajath Kumar), , సౌరబ్ శుక్లా, సుప్రియా పాఠక్, వాణీ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కి అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, మనోరమ స్టూడియోస్ బ్యానర్ల పై క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. అంతకుమించి కలెక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా మొదటి రోజే రూ.20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతూ భారీ సక్సెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి రూ.200 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రైమ్ థ్రిల్లర్ రైడ్ 2..
ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (Netflix)ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకోగా.. ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటించింది నెట్ఫ్లిక్స్. జూన్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందని తెలిపింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ అమే పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించగా, రితేష్ దేశ్ ముఖ్ కేంద్ర మంత్రి పాత్ర పోషించారు.
Also read: Kannappa Release : రివ్యూవర్స్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్… నెగిటివ్ రాస్తే ఇక కేసులే!
రైడ్ 2 సినిమా స్టోరీ..
రైడ్ 2 సినిమా స్టోరీ విషయానికి వస్తే.. నల్లధనం, అక్రమ సంపాదన పరులపై ఇండియన్ రెవెన్యూ ఆఫీసర్ అమే పట్నాయక్ (అజయ్ దేవగన్) నిరంతర దాడులు కొనసాగుతూనే ఉంటాయి. రాజా కున్వర్ (గోవింద్ నామ్ దేవ్) ప్యాలెస్ పై తన సిబ్బందితో కలిసి దాడి చేసి ట్రక్కుల్లో తరలిస్తున్న బంగారం, నగదును స్వాధీనం చేసుకుంటారు అమే పట్నాయక్. అయితే రాజా మేనేజర్ ఇచ్చిన రూ.2కోట్లను తీసుకొని నల్లధనాన్ని మాత్రం వదిలేస్తాడు అమే. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో అమే పట్నాయక్ జైపూర్ నుంచి భోజ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉండే స్థానిక నాయకుడు కేంద్ర మంత్రి మనోహర్ ధన్ కర్ (రితేష్ దేశ్ ముఖ్) అంటే ప్రజలకు అమితమైన గౌరవం ఉంటుంది. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు.
అయితే సామాజిక సేవ పేరుతో వందల కోట్లు ఆర్జించిన ఇతడి పై పట్నాయక్ కి అనుమానం కలుగుతుంది. మరి ఆయన అనుకున్నట్లు మనోహర్ దగ్గర నల్లధనం, అక్రమ సంపాదన ఉందా? లేదా అంతకుమించి ఏదైనా చేస్తున్నాడా? ఇప్పటివరకు అతడి సంపాదన గురించి అంతు చిక్కని రహస్యాన్ని పట్నాయక్ ఎలా కనిపెట్టాడు? అనేది ఈ సినిమా కథ.. ఆద్యంతం ఆకట్టుకుంటూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Aaj se ulti ginti shuru 🔥Amay Patnaik is back with a new case and the same old fire 👊
Watch Raid 2, out 26 June, on Netflix.#Raid2OnNetflix pic.twitter.com/f06uJB6feQ— Netflix India (@NetflixIndia) June 24, 2025