Dates Eating Warning| ఖర్జూరం లేదా డేట్స్.. అనేవి ఒక అద్భుతమైన ఫ్రూట్. శారీరక, మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడంలో ఇవి గొప్పగా సహాయపడతాయి. రోజూ రెండు ఖర్జూరాలు తినమని వైద్యులు సలహా ఇస్తారు. కానీ, వీటిని తినే ముందు కొంచెం చెక్ చేయాల్సిన అవసరముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఖర్జూరం లోపలి భాగాన్ని బాగా పరిశీలించాకే తినాలని చెబుతున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం.. ఖర్జూరం లోపల మోల్డ్ అనే ఫంగస్ ఉండే అవకాశాలున్నాయి. ఇవి తరచూ కనిపించవు. లోపల గింజ తీసిన తర్వాత వాటిని కోసి చూడటం వల్ల ఈ మోల్డ్ ఫంగస్‌ను గుర్తించి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ఖర్జూరంలో మోల్డ్స్ ఎందుకు వస్తాయి?
ఖర్జూరంలో ఎక్కువ చక్కెర, తేమ ఉండటం వల్ల ఈ మోల్డ్స్ ఫంగస్ సులభంగా పెరుగుతాయి. ఆమ్ల స్థాయి ఎక్కువగా ఉన్న ఆహారంలో కూడా మోల్డ్స్ ఫంగస్ వృద్ధి చెందుతాయి. ఇవి ఆకుపచ్చ, తెలుపు, నలుపు లేదా బూడిద రంగులో కనిపిస్తాయి. వీటి రూట్స్ ఆహారంలో లోతుగా పాతుకుపోతాయి, కానీ ఇవి మైక్రోస్కోప్‌తో మాత్రమే కనిపిస్తాయి.
మోల్డ్స్ ఉన్న ఆహారం తింటే ఏమవుతుంది?
మోల్డ్స్ అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని నీరసం కలిగించవు, కొన్ని అలర్జీలను కలిగిస్తాయి. మరికొన్ని విషపూరిత పదార్థాలను (మైకోటాక్సిన్స్) ఉత్పత్తి చేస్తాయి. మోల్డ్స్ ఫంగస్ ఉన్న ఆహారం తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి సమస్యలను కలిగిస్తాయి. అయితే కొన్ని మోల్డ్స్ ఆరోగ్యకరం కూడా. మష్రూమ్స్, బ్లూ చీజ్ వంటివి ఆరోగ్యకరమైన మోల్డ్స్ తో తయారవుతాయి, కానీ ఖర్జూరంలోని కొన్ని మోల్డ్స్‌తో ఆరోగ్యానికి హానికరం.
అలర్జీ లక్షణాలు
మోల్డ్స్ లో అలర్జీ లక్షణాలు ఇతర శ్వాసకోశ అలర్జీల మాదిరిగా ఉంటాయి.
ఆస్తమా ఉన్నవారిలో మోల్డ్స్ ఫంగస్.. అలర్జీ ఆస్తమా దాడులను ప్రేరేపిస్తుంది. కొన్ని మోల్డ్స్.. జలుబు లాంటి లక్షణాలు, జ్వరం, బాడీ నొప్పులను కలిగిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా అనాఫిలాక్సిస్ వంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చు. మైకోటాక్సిన్స్ గాలి, చర్మం లేదా పేగుల ద్వారా శరీరంలోకి చేరతాయి.
ఖర్జూరం రోజూ ఎందుకు తినాలి?
ఖర్జూరం తీపిగా, రుచికరంగా ఉంటాయి. వీటితో అనేక పోషకాలు, ప్రయోజనాలు ఉన్నాయి.
యాంటీఆక్సిడెంట్స్: ఖర్జూరంలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీర కణాలను కాపాడతాయి.
మెదడు ఆరోగ్యానికి మంచిది: ఖర్జూరం తినడం వల్ల మెదడులో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎముకల బలం: ఖర్జూరంలో ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలను నివారిస్తుంది.
Also Read: భయం లేకుండా పార్టీ ఎంజాయ్ చేయండి.. ఈ టిప్స్ పాటిస్తే నో హ్యాంగోవర్
జాగ్రత్తలు
ఖర్జూరం తినే ముందు గింజ తీసి, లోపలి భాగాన్ని కోసి చూడండి. మోల్డ్స్ ఫంగస్ ఉంటే వాటిని తినకండి. శుభ్రమైన, తాజా ఖర్జూరాలను ఎంచుకోండి. రోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, కానీ జాగ్రత్తగా తినడం మర్చిపోవద్దు!