Vijay Antony: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు (Politics)చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎంతోమంది సినిమాలలో పని చేసిన నటీనటులు మంచి గుర్తింపు లభించిన తర్వాత రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ఉన్నత పదవులు అధిరోహించారు. తమిళనాడులో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఎంజీఆర్ రాజకీయాలలోకి వచ్చి తమిళ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అదేవిధంగా జయలలిత కూడా నటిగా గుర్తింపు పొంది ఈమె కూడా ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారు . ఇక తెలుగులో కూడా నందమూరి తారక రామారావు నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొంది రాజకీయాలలోకి వెళ్లి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజకీయాలలో కూడా సక్సెస్…
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారంతా కూడా రాజకీయాలలో పేరు ప్రఖ్యాతలు పొందారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఈ సెలబ్రిటీలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది హీరోలు హీరోయిన్లు రాజకీయాలలోకి వస్తున్నారు. ఇటీవల తమిళనాడులో హీరో విజయ్ తలపతి కూడా పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాల వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు.
బిచ్చగాడుతో గుర్తింపు…
ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ ఆంటోని (Vijay Antony) ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆంటోని తెలుగులో బిచ్చగాడు సినిమా ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈయన తను నటించిన సినిమాలన్నింటినీ కూడా తెలుగులోనే విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో “మార్గాన్” (Margan) అనే సినిమా ద్వారా విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గుర్తింపు మాత్రం సరిపోదు..
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ ఆంటోనికి రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలోకి వస్తున్నారు అలా మీరు కూడా రాజకీయాలలోకి రాబోతున్నారా? రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు విజయ్ ఆంటోని సమాధానం చెబుతూ… రాజకీయాలలోకి రావాలి అంటే మంచి గుర్తింపు మాత్రమే ఉంటే సరిపోదు. రాజకీయాల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఆ అవగాహన మనకు ఉంటే రాజకీయాలలోకి వచ్చిన ప్రయోజనం ఉంటుందని తెలిపారు. నాకైతే రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు అంటూ ఈ సందర్భంగా విజయ్ ఆంటోని తనకు రాజకీయాలలోకి రావాలనే ఆసక్తి లేదని చెప్పకనే చెప్పేసారు.
Also Read: పెద్ది కోసం రంగంలోకి శేఖర్ జానీ మాస్టర్… గట్టిగానే ప్లాన్ చేస్తున్న బుచ్చిబాబు!