BigTV English

WTC Points Table : ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. WTC పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున టీమిండియా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే

WTC Points Table : ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. WTC పాయింట్స్ టేబుల్ లో అట్టడుగున టీమిండియా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే

WTC Points Table : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్నాయి. అయితే శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా శ్రీలంక డ్రా చేసుకుంది. దీంతో ఇరు జట్లకు 33.33 పాయింట్లు లభించాయి. ప్రస్తుతం కేవలం నాలుగు జట్లు మాత్రమే ఇప్పటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడాయి. వీటిలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. దీంతో భారత్ కి 0 పాయింట్లు రాగా.. ఇంగ్లాండ్ జట్టు కి 100 పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.


Also Read :  Goutham Gambhir: కోచ్ గా గంభీర్ పనికిరాడు.. అతని హయాంలో 5 దారుణమైన పరాజయాలు.. రంగంలోకి కొత్త కోచ్..BCCI భారీ స్కెచ్! 

అట్టడుగు స్థానంలో టీమిండియా..


ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండిస్ జట్లు ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పటివరకు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా మాత్రమే మ్యాచ్ లు ఆడాడు. దీంతో ఈ నాలుగు జట్లతో పోల్చుకుంటే.. టీమిండియా అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో పేలవ ప్రదర్శనతో టీమిండియా దారుణంగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ లో జరిగిన తొలి టెస్టులో భారత ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. భారత ఆటగాళ్లు మొత్తం 6 క్యాచ్ లు జారవిడిచారు. అందులో ఓపెనర్ జైస్వాల్ 4 క్యాచ్ లు విడిచిపెట్టడం గమనార్హం. చేతిలోకి వచ్చినటువంటి క్యాచ్ లను కూడా అతనడు నేలపాలు చేశాడు. అయితే మ్యాచ్ సందర్భంగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసిన సమయంలో అతను డ్యాన్స్ చేసి వీడియో పై భారత అభిమానులు మండిపడుతున్నారు. క్యాచ్ లు వదిలేసి ఇంత హ్యాపీగా ఎలా డ్యాన్స్ చేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు.

టీమిండియా లోయర్ ఆర్డర్ పేలవ ప్రదర్శన.. 

తొలి ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. కానీ తొలి ఇన్నింగ్స్ లో చివరి 7 వికెట్లు 41 పరుగుల తేడాతో కోల్పోతే.. రెండో ఇన్నింగ్స్ చివరి 6 వికెట్లు 31 పరుగుల తేడాతోనే కోల్పోవడం గమనార్హం. తొలి నలుగురు, ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. చివరి ఐదుగురు ఆటగాళ్లు చేతులెత్తేయడంతో టీమిండియా టపా టపా వికెట్లు కోల్పోయి.. ఓటమి పాలైంది. దీనికి తోడు బౌలింగ్ కూడా కట్టుదిట్టంగా చేయకపోవడంతో టీమిండియా కి షాక్ లు తప్పడం లేదు. ఇంగ్లాండ్ జట్టు 1 మ్యాచ్ లో విజయం సాధించి టాపర్ గా నిలిస్తే.. భారత జట్టు ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయి చిట్ట చివరి స్థానానికి పడిపోవడం గమనార్హం. మిగతా జట్లన్ని పాల్గొంటే.. పాయింట్ల పట్టిక రూపురేఖలు అన్ని ఒక్కసారిగా మారిపోతాయి.

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×