Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సాన(Bucchi Babu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ తదుపరి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game Changer) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడమే కాకుండా నిర్మాతలకు కూడా భారీ నష్టాలను తీసుకువచ్చింది.
విలేజ్ బ్యాక్ డ్రాప్…
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమా పై ఎన్నో అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ చాలా మాస్ గా ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది అలాగే ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
రంగంలోకి స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు..
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ విషయంలో మాత్రమే కాదు పాటల విషయంలో కూడా డైరెక్టర్ బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో పాటలకు అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం శేఖర్ మాస్టర్(Sekhar Master), జానీ మాస్టర్(Jani Master) రంగంలోకి దిగారని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ఇద్దరి కొరియోగ్రాఫర్లకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.
పెద్ది పైనే ఆశలు..
ఇప్పటికే వీరిద్దరూ కలిసి రాంచరణ్ తో కలిసి పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా తమ డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ ఒక పాట కోసం, శేఖర్ మాస్టర్ ఒక పాట కోసం పెద్ది సినిమాలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇద్దరు కొరియోగ్రాఫర్లు కూడా రంగంలోకి దిగారనే వార్త రావడంతో చరణ్ డాన్స్ పర్ఫామెన్స్ కూడా అదిరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాని సుకుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన రాంచరణ్ ఈ సినిమాతో హిట్టు కొట్టి ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.