E-Paper
Advertisement

హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
Advertisement

Rajinikanth:సౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ (Rajinikanth ) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి ఈయన రీసెంట్గా జైలర్ 2 చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరింత ఆనందంగా ఉన్న రజనీకాంత్.. సడన్గా హాస్పిటల్ లో కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలేమైంది అంటూ ఆరా తీస్తున్నారు.

కాలు జారిపడ్డ రజినీకాంత్ సోదరుడు..

అయితే రజనీకాంత్ సడన్గా హాస్పిటల్ లో కనిపించడానికి కారణం ఆయన సోదరుడు. రాజరాజేశ్వరి నగర్ లోని ఒక హాస్పిటల్లో తన సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ ను పరామర్శించడానికి వెళ్లారు. అసలు విషయంలోకి వెళ్తే.. సత్యనారాయణ రావు నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి అదుపుతప్పి కింద పడిపోయారట. ఆయన తల భాగానికి దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆయనను కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు తలకు శస్త్ర చికిత్స కూడా చేశారు . అయితే ఆయన కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా కళ్ళు తెరవలేదని కూడా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

Advertisement

జైలర్ 2 ఇచ్చిన ఆనందంతో సంతోషంగా ఉందామనుకునే లోపే.. వ్యక్తిగతంగా ఆయనను ఈ విషయం మరింత కలిచి వేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సోదరుడి దగ్గరకు వచ్చి వైద్యులను సోదరుడి ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వివరాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారట.ఇక సోదరుడిని పరామర్శించిన అనంతరం, కనకపుర రోడ్డులోని రవిశంకర్ గురు ఆశ్రమానికి వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు రజనీకాంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:టీనేజ్ లోనే లవ్.. అదే నా ప్రేమను పట్టించింది: కీర్తి సురేష్

రజనీకాంత్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు రజినీకాంత్.ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 12 2026న ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈయన నటిస్తున్న మరో చిత్రం (173వ చిత్రం) ధర్మన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార(Nayanthara ), శ్రీ లీల (Sree Leela), సిమ్రాన్ (Simran), రాశిఖన్నా(Rashi Khanna) తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram pothineni) కూడా ఇందులో నటిస్తుండడం గమనార్హం. అలాగే ప్రముఖ కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా ఇందులో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Related News

టీనేజ్ లోనే లవ్.. అదే నా ప్రేమను పట్టించింది: కీర్తి సురేష్

వామిక గబ్బి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. ఇదేం ట్విస్టు సీఎం సార్?

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!

రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!

చల్లని సముద్రంలో మానస చౌదరి.. సూర్యాస్తమయం వేళ అందాల విందు!వీడియో వైరల్

Big Stories

Advertisement
×