Lavanya Tripathi:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమాలలో నటిస్తున్నప్పుడే మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆ అబ్బాయికి ఇటీవల ఏడాది పుట్టినరోజుతో పాటు కేషఖండన కూడా ఘనంగా పూర్తి చేశారు.
ఇకపోతే ఒకవైపు కుటుంబ వ్యవహారాలతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈమె.. అటు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. అలాంటి లావణ్య త్రిపాఠి తాజాగా మేనత్తగా ప్రమోట్ అయింది. ఈ మేరకు ఆమె సోదరుడు పంచుకున్న పోస్ట్ కి ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. లావణ్య త్రిపాఠి ఈ ఏడాది ఆరంభంలో డెహ్రాడూన్ లో తన సోదరుడు సిద్ధార్థ్ వివాహానికి కుటుంబ సమేతంగా వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ పెళ్లి వేడుకల్లో తన కొడుకుతో కలిసి ఈమె సందడి చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
ఇకపోతే తన వదినమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా .. తన అన్నయ్య సిద్ధార్థ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా పంచుకున్న పోస్ట్ లో చిన్నారి ఫోటోని షేర్ చేయగా.. దీనికి “వెల్కమ్ టు ది వరల్డ్.. క్యూటెస్ట్ లిటిల్ వన్” అంటూ క్యాప్షన్ జోడించింది. మొత్తానికి అయితే తన అన్న, వదిన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది లావణ్య త్రిపాఠి. ఇందుకు సంబంధించిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు లావణ్య త్రిపాఠికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేనత్తగా మీరు ప్రమోట్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ:14 ఏళ్లుగా వనవాసం చేస్తున్నా.. విడాకులపై రేణు దేశాయ్ ఎమోషనల్!
లావణ్య త్రిపాఠి కుటుంబం విషయానికి వస్తే.. ఈమె సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది. వివాహం ద్వారా ప్రముఖ సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కొణిదెల కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది . ఈమె తండ్రి రతన్ త్రిపాఠి. ఆయన హైకోర్టు సివిల్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఈమె తల్లి కిరణ్ బాల తివారీ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా రిటైర్ అయ్యారు. ఇక లావణ్య త్రిపాఠి తోబుట్టువుల విషయానికొస్తే.. ఒక అన్నయ్య, ఒక సోదరి ఉన్నారు . ఈమె అన్నయ్య సిద్ధార్థ్ త్రిపాఠి కాగా, శివాని త్రిపాఠి అనే ఒక సోదరి కూడా ఉంది. ఆమె రాష్ట్ర పన్నుల శాఖ సహాయ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే 2017లో మిస్టర్ సినిమా సెట్ లో వరుణ్ తేజ్ ను కలుసుకున్న ఈమె.. ఆ తర్వాత 2023 జూన్ 9న అతనితో నిశ్చితార్థం చేసుకుంది. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2025 సెప్టెంబర్ 9న వాయువ్ తేజ్ అనే కుమారుడు కూడా జన్మించారు.