E-Paper
Advertisement

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!
Advertisement

Sonia Gandhi Case: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అదనపు ఆధారాలు, డాక్యుమెంట్లను సమర్పించేందుకు పిటిషనర్ కు అనుమతి ఇస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వికాస్ త్రిపాఠి అనే న్యాయవాది 1983లో సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందారని, అయితే 1980లోనే న్యూఢిల్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో ఆమె పేరు నమోదయ్యిందని కోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు పత్రాలతో ఆమె పేరును ఓటరు జాబితాలో చేర్చారంటూ దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Advertisement

అయితే ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైందని, చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చెయ్యటమే అని సోనియా గాంధీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ కోర్టు వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో ఆయన మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు.

Also Read: బీజేపీని గెలిపించడం కచ్చితంగా ప్రజల తప్పేనట! భావోద్వేగాలకు లొంగితే ఇలాంటి సీఎంలే వస్తారన్న పీకే! బీహార్‌ సీఎంపై ట్రోలింగ్స్‌..!

Advertisement

మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని రౌస్ ఎవెన్యూ కోర్టు ఎదుట పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ కోర్టు కేసును తిరిగి తాజాగా విచారించాలని మేజిస్ట్రేట్ కోర్టుకు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: 26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

Tags

Related News

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

ఇండియన్ బ్యాంక్‌లో 1,500 జాబ్స్.. డిగ్రీ ఉంటే చాలు..వెంటనే అప్లై చేయండి

ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టిన వ్యాన్.. స్పాట్‌లో 50 మంది, తమిళనాడులో ఘోర ప్రమాదం

షాకింగ్ ఘటన.. భార్యని కుర్చీకి కట్టేసి తగలబెట్టిన భర్త, అసలు మేటర్ అదే!

Big Stories

Advertisement
×