E-Paper
Advertisement

సింపుల్ గా కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్!

సింపుల్ గా కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్!
Advertisement

Kavaya Kalyan Ram -Kalabhairava: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే ఈ ఏడాదిలో మరి కొంతమంది సెలబ్రెటీలు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam tej)కిరణ్మయిల నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా సాయి తేజ్ తో పాటు మరొక హీరో తేజ సజ్జ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయాన్ని అధికారకంగా తెలియజేశారు.

సింపుల్ గా కావ్య కాలభైరవ నిశ్చితార్థం..

ఇకపోతే మరో హీరోయిన్ సైతం పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. బాలనటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ప్రముఖ సంగీత దర్శకుడు కాలభైరవ (Kalabhairava)తో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఇటీవల సెప్టెంబర్లో ఈ జంట తమ రిలేషన్ గురించి అధికారికంగా తెలియజేశారు. తాజాగా వీరి ఇంట్లో కూడా పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. కాలభైరవ కుటుంబ సభ్యులతో పాటు కావ్య కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థపు వేడుక చాలా సింపుల్ గా జరిగిందని తెలుస్తోంది.

డిసెంబర్లో కావ్య, కాలభైరవ వివాహం..

Advertisement

ఇలా వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థపు వేడుకలో భాగంగా కేవలం కావ్య తల్లితండ్రులతో పాటు కీరవాణి కుటుంబం రాజమౌళి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కావ్య కళ్యాణ్ రామ్, కాలభైరవ వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. వీరి వివాహం కూడా డిసెంబర్లోనే జరగబోతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.

వియత్నాంలో బ్యాచిలర్ పార్టీ..

ఇక ఈ జంట నిశ్చితార్థం జరుపుకున్నప్పటికీ తమ పెళ్ళి ఎప్పుడు ఏంటి అనే వివరాలను మాత్రం ఎక్కడా అధికారికంగా తెలియజేయలేదు. ఇక డిసెంబర్లోనే వీరి వివాహం ఉండబోతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక పెళ్లికి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కావ్య కళ్యాణ్ రామ్ తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీని వియత్నాంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా తన బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను కూడా కావ్య కళ్యాణ్ రామ్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక కాలభైరవ ప్రస్తుతం సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.  ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ గా కొనసాగున్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ముందుగానే ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

Advertisement

Also Read: మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. ఇదేం ట్విస్టు సీఎం సార్?

 

Related News

హాస్పిటల్లో చేరిన రజినీకాంత్ సోదరుడు.. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

టీనేజ్ లోనే లవ్.. అదే నా ప్రేమను పట్టించింది: కీర్తి సురేష్

వామిక గబ్బి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. ఇదేం ట్విస్టు సీఎం సార్?

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!

రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!

Big Stories

Advertisement
×