Renu Desai: రేణు దేశాయ్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. సినీనటిగా ఇండస్ట్రీలో ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందరికీ ఎంతో సుపరిచితమే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య అనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు (Divorce) తీసుకొని విడిపోయిన రేణు దేశాయ్ ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొనసాగుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.. ఇలా వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న విమర్శల పట్ల స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాజీ భార్య అని పిలవడంతో ఈ వ్యాఖ్యలపై రేణు దేశాయ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను పవన్ కళ్యాణ్ నుంచి 2012 వ సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయాను. దాదాపు 14 సంవత్సరాలుగా తాను ఒంటరిగా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నాను. సాక్షాత్తు శ్రీరాముడిలాగే తాను కూడా 14 ఏళ్ల వనవాసం చేశానని, శ్రీరాముడికి 14 ఏళ్ళు వనవాసం పూర్తి అయింది కానీ నాకు మాత్రం ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని తెలిపారు.
ఇలా తాను పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయి 14 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ తనని పవన్ మాజీ భార్య గాని గుర్తిస్తున్నారు. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదని, బద్రి సినిమాతోనే తాను జీవితాన్ని ప్రారంభించానని చాలామంది భావిస్తున్నారు. ఇలా ఈ 14 సంవత్సరాల కాలంలో తాను ఒక మరాఠీ సినిమాకు నిర్మాతగా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాను, మరో సినిమాకు కథ రచయిత, దర్శకత్వం, నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నాను. ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తున్నాను అలాగే ఎన్నో డాన్స్ షోలకు జడ్జిగా కూడా పనిచేశాను. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లేకుండా నేను ఒంటరిగా చేశాను. నన్ను గుర్తించి నాకు ఈ అవకాశాలు ఇచ్చారని ఈమె తెలిపారు.
ఇక తాను గత కొన్ని సంవత్సరాలుగా జంతు సంరక్షణ చేపడుతూ ఉన్నాను అయితే ఇందులో భాగంగా తాను ఒక కుక్కను కాపాడిన కూడా నా పట్ల విమర్శలు చేస్తూ ఉంటారని, పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు జీవించటానికి అర్హత లేదనే విధంగా విమర్శలు చేస్తుంటారంటూ తనపై వచ్చే విమర్శల పట్ల రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు.. ఇలా విడాకుల తర్వాత కూడా తనని పవన్ మాజీ భార్య అంటూ పిలవడం ,ఈ 14 ఏళ్ల కాలాన్ని వనవాసం అంటూ ఈమె సంబోధించడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: సింపుల్ గా కాలభైరవ కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం.. పెళ్లికి ముహూర్తం ఫిక్స్!