Anaswara Rajan: టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా యువ హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న వారిలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan)ఒకరు. ఛాంపియన్ సినిమా ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె నటించిన ఇట్లు అర్జున(Itlu Arjuna) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ నవంబర్ 13వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగార్జున(Nagarjuna) తో పాటు అఖిల్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి అనస్వర వేదికపై మాట్లాడుతూ ఇట్లు అర్జున సినిమా నవంబర్ 13వ తేదీ విడుదల అవుతుంది అనడానికి బదులుగా అక్టోబర్లో విడుదల కాబోతోంది అంటూ మాట్లాడారు అయితే వెంటనే తీరుకొని సారీ నవంబర్ 13వ తేదీ అంటూ సరి చేశారు.
ఇలా తన సినిమా విడుదల తేదీని మర్చిపోయి ఈమె మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ విన్న అభిమానులు మాత్రం విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. అనస్వర ఇలా మర్చిపోవడంలో తప్పులేదులే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు .నిజానికి ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కావాలి ఆ తర్వాత తొమ్మిది, అక్టోబర్ 30 అంటూ వరుసగా విడుదల తేదీలను వాయిదా వేస్తూ వచ్చారు.. ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడుతున్న ప్రతిసారి ఇట్లు అర్జున సినిమా కూడా వాయిదా వేస్తూ వచ్చారు..
ఇలా వరుసగా ఈ సినిమా వాయిదా పడుతూ రావడంతో సరైన విడుదల తేదీ విషయంలో అనస్వర కూడా కన్ఫ్యూజ్ అయ్యారని స్పష్టమవుతుంది. ఇలా ఎన్నోసార్లు విడుదలకు ఆటంకాలు ఏర్పడిన వాటన్నింటినీ ఎదుర్కొంటూ ఈ సినిమా చివరికి నవంబర్ 13వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. అయితే ఈ సినిమాలో హీరో మూగవాడి పాత్రలో కనిపించటం గమనార్హం.డెబ్యూ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి అనీష్ మొదటి సినిమాతోనే మూగవాడిగా నటిస్తూ సరికొత్త ప్రయోగం చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ ప్రయోగం అతనికి ఎలా కలిసి వస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: కావ్య అనిరుద్ వెడ్డింగ్.. రిసార్ట్ ఒక్క రోజు అద్దె ఎంతో తెలుసా?