E-Paper
Advertisement

అనన్య పాండే దీపావళి సెలబ్రేషన్స్.. ఏముంది ఈ అందం!

అనన్య పాండే దీపావళి సెలబ్రేషన్స్.. ఏముంది ఈ అందం!
Advertisement

Ananya Panday:అనన్య పాండే..స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ అందాల భామ.ముఖ్యంగా తన ఫ్యాషన్, ట్రెండీ లుక్స్, ఫోటోషూట్స్‌తో నెట్టింట పెట్టే పోస్టులు అభిమానులని ఫిదా చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా దీపావళి సందర్భంగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలకు అనన్య పెట్టిన క్యాప్షన్ అయితే హైలెట్. దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకున్న అనన్య పాండే తన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Advertisement

ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ ,సాలిడ్ జ్యువెలరీతో తన లుక్‌ను మరింత స్పెషల్ గా మార్చేసింది ఈ అందాల భామ.ముఖ్యంగా ఎరుపు రంగు బ్యాక్‌డ్రాప్‌లో అనన్య రాయల్ లుక్‌లో మెరిసిపోతోందనడంలో సందేహం లేదు.ముఖ్యంగా హెవీ ఎంబ్రాయిడరీతో చేసిన డిజైనర్ బ్లౌజ్, నుదుటిపై ఉన్న మాంగ్ టిక్కా ఆమె అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి.ఇక వెస్ట్రన్ ఫ్యాషన్‌లోనే కాకుండా ఇండియన్ ట్రెడిషనల్ కాస్టూమ్స్ తోనూ ఫిదా చేస్తానని ఈ ఫోటోలతో మరోసారి ప్రూవ్ చేసింది అనన్య.

అయితే ఈ ఫోటోలకు అనన్య పెట్టిన క్యాప్షన్ మాత్రం హైలెట్. ‘ఈ ఫోటోలు చాలా పద్ధతిగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నాయని నాకు తెలుసు. కానీ నిజంగా చెప్పాలంటే ఈసారి దీపావళిని నా జీవితంలోనే అత్యంత ఆనందంగా జరుపుకున్నాను’ అంటూ తన హ్యపీ నెస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది ఈ స్టార్ కిడ్. అయితే ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయి? ఎవరెవరు పాల్గొన్నారు? అనే విషయాలను మాత్రం ఈ భామ బయటపెట్టకపోవడం గమనార్హం.

Advertisement

ఇక అనన్య సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌లో 2019లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది.ఇక దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన ‘గెహ్రాయియాన్’ సినిమాలో కీరోల్ పోషించిన ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమైంది.అయితే ఈ సినిమా తెలుగు నాట బొక్క బోర్లా పడటంతో ,మళ్ళీ మరో సినిమాలో కనబడకుండా పోయింది ఈ భామ.

అయితే బాలీవుడ్ లో ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘ఖో గయే హమ్ కహాన్’ సినిమాలతో తన నటనలో మరో యాంగిల్ ని బయట పెట్టి తనేంటో ప్రూవ్ చేసింది. ముఖ్యంగా ‘ఖో గయే హమ్ కహాన్’లో ఆమె నటనకు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్ .అలాగే ‘CTRL’ చిత్రంతో డిజిటల్ లోనూ సత్తా చాటిన అనన్య ‘కేసరి చాప్టర్ 2’ వంటి సినిమాలతో మెప్పించింది.మొత్తానికి సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే అనన్య పాండే ఈసారి తన దీపావళి ఫోటోలు, క్రేజీ క్యాప్షన్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.

ALSO READ :హీరోగా ఎంట్రీ.. హైకోర్టు అడ్వకేట్‌గా కెరీర్.. ప్రేమ్ సాగర్ లైఫ్‌లో ఇన్ని ట్విస్టులా?

Tags

Related News

హీరోగా ఎంట్రీ.. హైకోర్టు అడ్వకేట్‌గా కెరీర్.. ప్రేమ్ సాగర్ లైఫ్‌లో ఇన్ని ట్విస్టులా?

అనిరుద్ కావ్య వెడ్డింగ్.. గ్రీస్ లో ల్యాండ్ అవుతున్న స్టార్స్!

మంచివాడిలా కనిపిస్తూనే విలనిజం.. గొల్లపూడి స్టైల్‌కు ఫిదా అవ్వాల్సిందే!

అనిరుధ్ – కావ్య మారన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

రామాయణంలో సీత పాత్ర పై.. అలనాటి సీత షాకింగ్ కామెంట్స్!

లక్ష్మీదేవిలా మెరిసిన మృణాల్.. ఈ అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

హీరో దర్శన్ కు భారీ ఊరట.. కోర్ట్ గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×