Savitri Assets:మహానటి సావిత్రి…తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈవిడ చూసినన్ని అప్ అండ్ డౌన్స్ మరొకరు చూడలేదంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ఆమె జీవితంలో గడిపిన చివరి రోజులు ఒక విషాదభరితం అనే చెప్పాలి.ఇక సావిత్రి యొక్క ఆర్థిక పరిస్థితి, ఆస్తుల వ్యవహారాలపై ఇప్పటికీ మూవీ లవర్స్ డిబేట్లు పెట్టేస్తుంటారు కూడా.ఇక ఈ క్రమంలో తాజాగా నటుడు ప్రేమ్ సాగర్ రాజులపాటి సావిత్రి ఆస్తులపై చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు సావిత్రి సొంతం
ఈ ఇంటర్వ్యూలో ప్రేమ్ సాగర్ తన సినీ జర్నీతో పాటు అప్పటి సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులు, హైదరాబాద్ లో వచ్చిన మార్పులు, అప్పటి నటీనటులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే యూసఫ్‌గూడ గురించి మాట్లాడుతు మహానటి సావిత్రికి సంబంధించి యూసఫ్‌గూడలో ప్రస్తుతం కనిపిస్తున్న కొన్ని స్థలాలు, భవనాలు ఒకప్పుడు సావిత్రి సొంతం అని తాను విన్నానని తెలిపారు.
ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ హౌస్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్ , దాని పక్కనే ఉన్న బిల్డింగ్ సావిత్రికి సంబంధించినవని తనకు తెలిసినట్లు ప్రేమ్ సాగర్ చెప్పుకొచ్చారు.అంతేకాదు, ఆ ప్రాంతంలో ఒకప్పుడు చెరువు ఉండేదని, ప్రస్తుతం అక్కడ రోడ్లు, పార్కులు, వచ్చాయని గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు ఖాళీగా ఉన్న స్థలాలన్నీ ఇపుడు కమర్షియల్ బిల్డింగ్స్ తో నిండిపోయాయని చెప్పారు.
ఒకప్పుడు అడవిలా ఉన్న జూబ్లీహిల్స్.. ఇప్పుడు
ఇక సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన రోజుల్లో జూబ్లీహిల్స్, పద్మాలయ స్టూడియో ఉన్న ప్రాంతాలు ఇప్పటిలా ఉండేవి కాదని అప్పట్లో ఆ ప్రాంతమంతా అడవిలా కనిపించేదని, పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లుతో నిండి ఉండేదని ప్రేమ్ సాగర్ వివరించారు.
ఇక జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఒక చిన్న తాటాకు పాకలో టీ కొట్టు మాత్రమే ఉండేదని,రాత్రి సమయాల్లో నడుచుకుంటూ వెళ్లాలంటే పాములు, ఉంటాయేమోనని భయపడేవాళ్లమని తెలిపారు.ఇక కోటి నుంచి పద్మాలయ స్టూడియో వైపు వెళ్లే సమయంలో కూడా ట్రాన్స్పోర్ట్ అసలు ఉండేది కాదని అన్నారు.అదే ఇప్పుడు అదే ప్రాంతంలో భారీ బిల్డింగ్స్ , కమర్షియల్ కాంప్లెక్సులు, పెట్రోల్ బంకులు, ఏర్పడ్డాయని వివరించారు.
మహానటి ఆస్తులు.. కాలక్రమంలో ఏమయ్యాయి?
అయితే సావిత్రి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఆమెకు ఒకప్పుడు భారీగా ఆస్తులు ఉండేవని, అయితే చివరి దశలో వాటిలో చాలా వరకు చేతులు మారాయని, కొన్ని ఆస్తులపై వేరే వాళ్ళు హక్కులు పొందారని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో ఇండస్ట్రీలో చాలా మంది తాము సంపాదించిన ఆస్తులు వాళ్ళ చేతుల్లో లేకుండా పోయానని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షిని కాదు
మహానటి సావిత్రి జీవితంలో చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడ్డారనే విషయం తెలిసిందే. అయితే సావిత్రి చివరి రోజుల్లో జరిగిన వాటికి తాను ప్రత్యక్ష సాక్షిని కాదని, ఇతరుల ద్వారా విన్న విషయాలే తనకు తెలుసని చెప్పారు. ముఖ్యంగా నటి తులసి ద్వారా సావిత్రి మరణవార్త, ఆమె చివరి పరిస్థితుల గురించి తెలిసిందని సావిత్రి ఆస్తులపై తనకు తెల్సిన సమాచారాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ప్రేమ్ సాగర్ !
ALSO READ :అనన్య పాండే దీపావళి సెలబ్రేషన్స్.. ఏముంది ఈ అందం!