Census 2027: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి తెలంగాణలో జనగణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెన్సెస్-2027 నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం.155ను విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు నెలరోజుల పాటు సిబ్బంది ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలను సేకరించనున్నారు. ఈసారి జనగణనలో సరికొత్తగా ‘స్వీయ జనగణన’ విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్యూమరేటర్లు ఇంటికి రాకముందే పౌరులు తమ వివరాలను డిజిటల్‌గా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ 2027 జనవరి 10 నుండి జనవరి 24 వరకు కొనసాగనున్నది. ఇక ఫీల్డ్ ఎన్యూమరేషన్ 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు, రివిజనల్ రౌండ్ మార్చి 1 నుంచి మార్చి 5 వరకు జరగనున్నది. అయితే జనగణన ప్రక్రియకు సంబంధించి 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక సమయంగా నిర్ధారించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read: 150 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణాన్ని కూల్చేయాలని ప్లాన్… సిస్టమ్‌పై సామాన్యుడి దండయాత్ర