Anirudh -Kavya Maran Wedding: సౌత్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు పై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈయన ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఏకైక వారసురాలు కావ్య మారన్ (Kavya Maran) తో ఏడడుగులు నడవబోతున్నారు. వీరి పెళ్లికి గ్రీస్ లోని ఒక రిసార్ట్ అందంగా ముస్తాబయింది. ఇప్పటికే అనిరుద్ కావ్య కుటుంబంతో పాటు పెళ్లికి హాజరయ్యే వారందరూ కూడా గ్రీస్ లో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 10, 11 తేదీలలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇకపోతే కావ్య, అనిరుద్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిరుద్ కావ్య తమ అభిరుచులకు అనుగుణంగా ఈ వివాహ వేడుకను జరుపుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇన్విటేషన్ కోసం ఏకంగా 20000 రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కావ్య అనిరుద్ పెళ్లి కోసం చేస్తున్న ప్రస్తుత సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్ కోసం బుక్ చేసిన రిసార్ట్ అత్యాధునిక సదుపాయాలతో కూడుకుంది. ఈ రిసార్ట్ విఐపి, వీవీఐపీల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయని తెలుస్తుంది.
ఈ రిసార్ట్ లో ఒక్కరోజు స్టే చేస్తూ ఏదైనా వేడుక జరుపుకోవాలని అంటే సుమారు 50 లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.. ఇలా ఈ రిసార్ట్ కోసమే రోజుకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే మూడు రోజులుగా ఈ రిసార్ట్ లో కావ్య అనిరుద్ వివాహపు వేడుకలు జరగబోతుంది. కేవలం రిసార్ట్ కోసమే వీళ్ళు మూడు కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అదే విధంగా ఈ వివాహ వేడుకలో పాల్గొంటున్న అతిథుల కోసం పసందైన భోజనాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్లేటుకు సుమారు 35 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఇలా కావ్య మారన్ అనిరుద్ వివాహం కోసం నిర్మాత కళానిధి మారం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా వీరి వివాహం గ్రీస్ లో జరగగా వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం నవంబర్ 21 చెన్నైలో ఎంతో ఘనంగా జరగబోతుంది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో భాగంగా సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తమిళ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరికీ నేరుగా కళానిధి మారన్ ఆహ్వానం అందజేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మీ’ ..స్ట్రీమింగ్ డేట్ లాక్!