Prem Sagar Rajulapati:ప్రేమ్ సాగర్ రాజులపాటి..ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టరేమో కాని ఆయన్ని చూస్తే ఓహో ఈయనేనా అని ఈజీగా గుర్తుపట్టేస్తాం.ఇక ఇప్పుడు చాలా సినిమాల్లో వరుస పాత్రలు వేస్తూ తెగ బిజీ అయిపోయారు కూడా.అయితే ఈయన గతం లో హీరోగా చేశాడని ఎంత మందికి తెలుసు.అయితే హీరోగా కెరీర్ కంటున్యూ చేయకుండా సినిమాలకు దూరమై న్యాయవాదిగా మారి హైకోర్టులో ప్రాక్టీస్ పనిలో పడిపోయిన ప్రేమ్ సాగర్ ఇపుడు క్యారెక్టర్ ఆరిస్ట్ గా సత్తా చాటుతుండటం విశేషం.ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు.
హీరో కావాలనుకున్నాడు.. కానీ
ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ తన సినీ జర్నీ అనుకున్నంత సాఫీగా సాగలేదని తన తల్లిదండ్రులు అనుకోకుండా ప్రమాదంలో మరణించడంతో జీవితంలో ఒక్కసారిగా పెద్ద విషాదం ఏర్పడిందని చెప్పారు. ఆ ఇన్సిడెంట్ తనని బాగా కుంగదీసిందని, ఆ బాధ నుంచి బయటపడటానికి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు కూడా తనపై పడ్డాయని, తన పెళ్ళితో పాటు తమ్ముడి పెళ్లి , కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యతలు ఉండటంతో సినిమాల కంటే కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు.
గ్రూప్-1లో విజయం.. డీఎస్పీ అవకాశం కూడా
ఇక తనకి ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఎం.కామ్ పూర్తి చేసిన తర్వాత లా చదివి గ్రూప్-2 పరీక్షలో పాస్ అయ్యానని ఆ తర్వాత గ్రూప్-1 పరీక్షను కూడా మొదటి అటెంప్ట్ లోనే పాస్ అయినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఆ సమయంలో తనకు డీఎస్పీ స్థాయి ఉద్యోగానికి వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ పోలీస్ శాఖలో పనిచేయాలనే ఇష్టం లేకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ పోలీస్ శాఖలో చేరి ఉంటే ఈరోజు ఐజీ స్థాయిలో రిటైర్ అయ్యేవాడినని సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక ఆయనకు ఆర్మీలో చేరాలనే కోరిక కూడా బలంగా ఉండేదని తండ్రి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం, యుద్ధంలో మెడల్ అందుకోవడం, ఆయనలోని సిన్సియారిటీ,హనేస్టీ తనకు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు. కానీ అప్పటికే తమ్ముడు కూడా ఆర్మీలో ఉండటంతో ఇద్దరు కుమారులు సైన్యంలోకి వెళ్తే తమకు ఎవరు ఉంటారని తల్లి చెప్పిన ఒక్క మాట ఆయన నిర్ణయాన్ని మార్చేసిందని . దీంతో సైన్యంలో చేరాలనే తన కలను పక్కనపెట్టి లాయర్ ప్రొఫెషన్ వైపు వెళ్లానని చెప్పారు.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైఎస్సార్ వరకు..
ఇక లాయర్ గా కెరీర్ ప్రారంభించిన తనకు మొదటి నుంచీ మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయాలనే ఆసక్తి ఉండేదని తమిళ భాష కూడా తెలిసి ఉండటంతో అక్కడే ప్రాక్టీస్ ప్రారంభించానని అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు మారాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాదిగా పనిచేసే అవకాశం వచ్చిందని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేసే అవకాశం లభించిందని చెప్పారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల సమయంలోనూ ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టానని ఇలా రాజకీయంగా వివిధ ప్రభుత్వాల కలాంలో పనిచేయడం తన జీవితంలో ఒక మెమరీగా మిగిలిపోయిందని ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ప్రేమ్ సాగర్.
ALSO READ :జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!