Ramayana Movie: ఒక సినిమా తీయడానికి 2 వేల కోట్లు ఖర్చు చేయడం అనేది చిన్న విషయం కాదు. అదే సినిమా రెండు పార్ట్‌ల కోసం ఏకంగా 4 వేల కోట్లు ఖర్చు అంటే.. అది ఒక సాహసం అనే చెప్పాలి. ఇది కేవలం సినిమా కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద బడ్జెట్ ప్రయోగాల్లో ఒకటి అని కూడా చెప్పొచ్చు. డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ పార్ట్ వన్ విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వరకు వసూలు చేసింది. వినడానికి ఈ నెంబర్ చాలా పెద్దదిగానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఈ వసూళ్లు సరిపోతాయా? రెండు పార్ట్‌ల నిర్మాణానికే దాదాపు 4 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. మరి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి? అసలు ఇంత డబ్బు దేనికి ఖర్చవుతోంది? రామాయణ నిజంగా సక్సెస్ కావాలంటే రావాల్సిన కలెక్షన్స్ ఎంత?
ఫస్ట్ డే భారత్‌లో 77 కోట్లు..
రామాయణ.. చాలా మంది హిందూవులను టచ్ చేసే మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే భారత్‌లో 77 కోట్లకు పైగా, ఓవర్సీస్లో 51 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ 128 కోట్లకు పైగా నమోదైంది. రెండో రోజు భారత్‌లో 57 కోట్లు, విదేశాల్లో 44 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీంతో వరల్డ్ వైడ్ గ్రాస్ 101 కోట్లకు పైగా నమోదైంది. ఇక మూడో రోజు మాత్రం వసూళ్లలో మళ్లీ జోరు కనిపించింది. భారత్‌లో 83 కోట్ల 45 లక్షలు, ఓవర్సీస్లో 62 కోట్లు కలిపి మొత్తం 143 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా మూడు రోజుల్లో కలిపి 500 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి ఈ మూవీకి.
నిర్మాతలకు లాభం వచ్చేసినట్టేనా?
సినిమా బడ్జెట్ 4 వేల కోట్లు అనగానే.. అంతే మొత్తంలో వసూలు చేస్తే నిర్మాతలకు లాభం వచ్చేసినట్టేనా?.. కాదు. ఇక్కడే అసలు సినిమా లెక్కలు మొదలవుతాయి. ఒక సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాని బడ్జెట్‌కు సుమారు రెండున్నర రెట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే 2 వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావాలంటే 5 వేల కోట్ల గ్రాస్ కలెక్షన్లు అవసరమవుతాయనేది అంచనా. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. సినిమా బడ్జెట్లో ఏయే ఖర్చులు చేర్చారు? మార్కెటింగ్ ఖర్చు ఎంత? డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు ఎలా ఉన్నాయి? శాటిలైట్, ఓటీటీ హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయి? వంటి అంశాలను బట్టి బ్రేక్ ఈవెన్ లెక్క మారుతుంది.
అసలు నిర్మాత జేబులోకి ఎంత వెళ్తుంది?
ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు కొన్న టికెట్ల డబ్బులన్ని ప్రొడ్యూసర్ జేబులోకి నేరుగా వెళ్లదు. టికెట్ ధరలో కొంత భాగం పన్నుల రూపంలో వెళ్తుంది. మిగిలిన మొత్తంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమ వాటాలు తీసుకుంటారు. సో.. నిర్మాతకు చేరేది మొత్తం టికెట్ కలెక్షన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్.. సినిమా 100 కోట్లు వసూలు చేస్తే.. అందులో దాదాపు 50 శాతం మల్టీప్లెక్స్‌లు లేదా సినిమా హాళ్లకే వెళ్తుంది. నిర్మాత చేతికి వచ్చేది 35 నుంచి 40 శాతం మాత్రమే. దీనికితోడు ఇప్పటి రోజుల్లో మార్కెటింగ్, ప్రమోషన్ల ఖర్చే 100 కోట్లకు పైగా దాటుతోంది. కానీ థియేటర్లతో పాటు ప్రొడ్యూసర్‌కు మరో మూడు రూట్స్‌లో ఆదాయం వస్తుంది. అవి శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, మ్యూజిక్ రైట్స్. అంటే సినిమా థియేటర్లలో ఎంత వసూలు చేసిందన్నదే కాదు.. ఈ ఇతర హక్కుల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్నదీ నిర్మాతల లాభనష్టాలను డిసైడ్ చేస్తుంది.
రామాయణ 5 వేల కోట్ల మార్క్ అందుకోగలదా?
మరి రామాయణ 5 వేల కోట్ల మార్క్ అందుకోగలదా? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్పాలంటే మూడు విషయాలపై మనం ఫోకస్ చేయాలి. మొదటిది.. అడ్వాన్స్ బుకింగ్స్. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ వస్తే మంచి ఊపు వచ్చినట్టే. రామాయణకి 152 కోట్ల ప్రీ సేల్స్ వచ్చాయి.
ఫస్డ్ డే కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల నుంచి 200 కోట్ల
రెండోది.. ఫస్డ్ డే కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల నుంచి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ వస్తే మంచి స్టార్ట్ లభించినట్టే అని చెప్పుకోవాలి. కానీ రామాయణ ఈ నెంబర్‌ను రీచ్ కాలేదు.
సోషల్ మీడియాలో రియాక్షన్ ఎలా ఉంది?
ఇక మూడోది.. అతి ముఖ్యమైనది ప్రేక్షకుల రెస్పాన్స్. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజుల తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారా? మౌత్ టాక్ బాగుందా? సోషల్ మీడియాలో రియాక్షన్ ఎలా ఉంది? ఇవే ఆ తర్వాతి కలెక్షన్స్‌కు బేస్ అవుతాయి. ఈ ఇయర్లో రిలీజ్ అయిన హనుమాన్ అంశ్ మూవీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. మొదటి వారంలో వసూళ్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఆ తర్వాతి వారాల్లో కలెక్షన్లు పెరిగాయి. దీనికి రీజన్ మౌత్ టాక్. అందుకే రామాయణ విషయంలోనూ తొలి మూడు రోజుల వసూళ్లతోనే అంతా అయిపోయింది అనలేం.
రామాయణ ఫస్ట్ పార్ట్‌కే 2 వేల కోట్ల బడ్జెట్ ఎందుకు?
ఇప్పుడు అందరినీ తికమకపెడుతున్న క్వశ్చన్ దగ్గరికి వద్దాం. రామాయణ ఫస్ట్ పార్ట్‌కే 2 వేల కోట్ల బడ్జెట్ ఎందుకు?.. దీనికి చాలా కారణాలున్నాయి. ఈ మూవీ కోసం 2024 నుంచే సెట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 150 సెట్లను వేసినట్టు తెలుస్తోంది. అంటే తెరపై కనిపించే అయోధ్య, అడవులు, రాజభవనాలు, యుద్ధభూములు వంటి ప్రపంచాన్ని సృష్టించడానికి భారీ స్థాయిలో పని జరిగింది. ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్తో పాటు మన దేశానికి చెందిన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. హాన్స్ జిమ్మర్ రెమ్యూనరేషన్ ఒక్కటే 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇక భారీ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, వందలాది మంది కళాకారులు, భారీ నిర్మాణ ఏర్పాట్లు.. ఇవన్నీ కూడా బడ్జెట్ పెరగడానికి ఓ కారణం. ముఖ్యంగా రామాయణం లాంటి ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత ఈజీ టాస్క్ కాదు.
రికార్డులను బద్దలు కొట్టే లక్ష్యం మాత్రమే కాదు..
ఓవరాల్‌గా చూస్తే.. రామాయణ ముందు ఉన్నది కేవలం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే లక్ష్యం మాత్రమే కాదు. ఇండియన్ మూవీ స్థాయిని వరల్డ్ వైడ్‌కు తీసుకెళ్లే సత్తా ఉందని ప్రూవ్ చేసే రెస్పాన్సిబులిటీ. దీంతో బాటు.. ఇక ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కావాలంటే.. ఇంకా చాలా జర్నీ చేయాల్సి ఉంది.
తరాలు మారినా.. యుగాలు మారిన..
తరాలు మారినా.. యుగాలు మారిన.. రామాయణం అనేది గొప్ప ఇతిహాసం అనేది ఈ మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట. ఈ ఇతిహాసాన్ని ప్రపంచానికి గొప్పగా చూపించాలన్నదే తన ఆశ అంటున్నారు. అందుకే ఇంత ఖర్చు చేస్తున్నానని.. మూవీ రిలీజ్‌కు ముందు అనౌన్స్ చేశారు. మరి ఆయన ఆశయం అయితే బాగానే ఉంది. మరి కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయా? ఈ ఇతిహాసం ఆయనకు మంచి లాభాలను తెచ్చి పెడుతుందా? లేదా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
Also Read: ఏఐ సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి.. సీపీ సజ్జనార్ హెచ్చరిక