Satya Dev: సత్యదేవ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సత్యదేవ్(Satya Dev) తాజాగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్డమ్(King Dom) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ సినిమాలో ఈయన విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ అన్నగా సత్యదేవ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమాలో ఈయన నటనకు ఎంతో మంచి ఆదరణ ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో హీరో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేశారు.
ప్రాధాన్యత లేని పాత్రలు…
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడుతూ తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ అన్నయ్య శివ పాత్రలో నటించడానికి కారణం లేకపోలేదని తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నాకు కథ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా శివ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉందని ఈ సినిమాలో నటించానని తెలిపారు. కింగ్డమ్ సినిమా కంటే కూడా ముందుగానే తనకు ఎన్నో సినిమాలలో సహాయ నటుడిగా అవకాశాలు వచ్చాయని కానీ తాను ఆ సినిమాలకు కమిట్ అవ్వలేదని తెలిపారు.
డబ్బు కోసం సినిమాలు చెయ్యను…
ఇదివరకు అవకాశం వచ్చిన సినిమాలలో పెద్దగా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల తాను నటించలేదని సత్యదేవ్ తెలిపారు. ఇలా ప్రాధాన్యత లేని పాత్రలో అవకాశం వస్తే తాను అసలు నటించనని అలాంటి పాత్రలలో నటించడం కంటే సినిమాలు చేయకపోవడమే మంచిదని తెలిపారు. తాను డబ్బు కోసం సినిమాలలో నటించలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నాకు అలాంటి పరిస్థితి కనుక వస్తే కచ్చితంగా ఆ రోజు సినిమా ఇండస్ట్రీని వదిలి పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతానే తప్ప ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలలో డబ్బుకు ఆశ పడి నటించనని తెలిపారు.
బోటు నడపడం రాదు..
సత్యదేవ్ ప్రస్తుతం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని యాక్షన్ సన్ని వేశాలలో నటించేటప్పుడు కొన్ని ప్రమాదాలకి కూడా గురి అయ్యా అంటూ ఈయన తెలిపారు ముఖ్యంగా తనకు బోటు నడపడం రాదు . బోటు నడిపే సన్నివేశాలలో విజయ్ దేవరకొండ చాలా ధైర్యంగా నా పక్కన కూర్చున్నారు. ఇక బోటు తాను కుడి వైపుకు నడపాలని చూస్తే అది ఎడమ వైపుకు వెళుతుందని, ఈ సన్నివేశాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులకి గురి అయ్యాము అంటూ ఈ సందర్భంగా సత్యదేవ్ వెల్లడించారు. ఇక విజయ్ దేవరకొండ సినీ కెరియర్ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి గీతగోవిందం సినిమా తర్వాత ఈ స్థాయిలో సక్సెస్ అందుకోలేదని చెప్పాలి. అయితే కింగ్డమ్ సినిమా మాత్రం ఈయనకు మంచి సక్సెస్ అందించిందని తెలుస్తోంది. ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండతో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sukumar: నోటమాట రాలేదు.. కూతురికి నేషనల్ అవార్డు..సుకుమార్ ఎమోషనల్ పోస్ట్!