A.K. Rayaru Gopal: కేరళలోని కన్నూర్‌లో రూ.2 డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన ఏ.కే. రాయరు గోపాల్ (80) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. దాదాపు 50 ఏళ్ల పాటు అతి తక్కువ ఫీజు రూ.2తో పేదలకు వైద్య సేవలందించిన ఆయన, వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవలు కన్నూర్‌తో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.
రాయరు గోపాల్ ఏ. గోపాలన్ నంబియార్, ఏ.కే. లక్ష్మీకుట్టియమ్మ జన్మించారు. తండ్రి నీతిమంతమైన వైద్య సేవల స్ఫూర్తితో, ఆయన లాభాపేక్ష లేకుండా వైద్యం కొనసాగించారు. డబ్బు సంపాదించాలంటే వేరే వృత్తిని ఎంచుకోవాలని తండ్రి చెప్పిన సూత్రాన్ని ఆయన జీవితంలో ఆచరించారు. రూ.2 ఫీజుతో ప్రారంభించిన ఆయన, తర్వాత రూ.40-50కి పెంచినప్పటికీ, అది సామాన్య వైద్యుల ఫీజు కంటే చాలా తక్కువే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఉచితంగా మందులు కూడా అందజేసేవారు.
డా. గోపాల్ రోజూ తెల్లవారుజామున 2:15 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకునేవాడు. ఆ సమయం నుంచి రోజును ప్రారంభించేవాడు. ఉదయం 6:30 నుంచి రోగులను చూడటం ప్రారంభించేవారు. రోజూ వందలాది మంది రోగులను, ముఖ్యంగా పేద వారికి ఎక్కువగా ట్రీట్ మెంట్ చేసేవారు. ఆయన భార్య శకుంతల రోగుల సంఖ్యను నిర్వహించడంలో సహకరించేవారు. రాయరు గోపాల్ ఆయన దగ్గరకు వచ్చిన రోగులను మంచిగా చూసుకునేవారు.
ALSO READ: Kaleshwaram Report: కాళేశ్వరం నివేదిక ముగిసిన భేటీ.. కేసీఆర్‌కు బిగ్ షాక్..?
ఆయన సోదరులు డా. వేణుగోపాల్, డా. రాజగోపాల్‌లతో కలిసి, వైద్య సేవలో నిస్వార్థ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నుంచి ఉత్తమ వైద్య అవార్డు కూడా అందుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయనను ‘జనతా డాక్టర్’గా కొనియాడారు. ఆయన సేవలు పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పేవారు.
ALSO READ: Forest Beat Officer: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. సెలబస్ ఏంటి..? జీతం ఎంత వస్తుంది..?
డా. గోపాల్ తన భార్య శకుంతల, కుమారుడు డా. బాలగోపాల్, కుమార్తె విద్య, కోడలు డా. తుషార బాలగోపాల్, మనుమడు భరత్ మోహన్‌లతో కన్నూర్‌లోని ‘లక్ష్మీ’ నివాసంలో జీవించారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ పయ్యంబలంలో జరిగాయి. డా. గోపాల్ వైద్యం సేవగా, లాభాపేక్షగా కాదని నిరూపించిన లెజెండ్‌గా కన్నూర్‌లో చిరస్థాయిగా నిలిచారు.