Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై సచివాలయంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమక్షంలో ఈ సమావేశం జరిగింది. రెండు రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం రేవంత్ సర్కార్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులను సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
కాసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ నివేదకపై సమావేశం ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాలు జరిగినట్టు కమిషన్ తెలిపింది. ఆర్థికశాఖ, అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ పంపిన అంచనాలకు.. గుడ్డిగా ఆమోదం తెలిపారని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఆర్థిక శాఖ అయితే కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని వివరించింది.
ALSO READ: Forest Beat Officer: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. సెలబస్ ఏంటి..? జీతం ఎంత వస్తుంది..?
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ పాత్రపై కమిషన్ నివేదకలో పొందుపరిచింది. రేపు కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. రేపు కేబినెట్ సమావేశంలో కాళేశ్వర కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో సర్కార్ పూర్తి నివేదికను ప్రవేశపెట్టనుంది.
ALSO READ: Russia Earthquake: మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన భారీ అగ్నిపర్వతం.. 6000 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన..?