E-Paper
Advertisement

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!
Advertisement

Mamitha Baiju: ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్న వారిలో క్రేజీ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) ఒకరు. ఈ ఏడాదిలోనే జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెం కుడుంబ యూనిట్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాల ద్వారా సుమారు 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలు హిట్ కావడంతో ఈమె లక్కీ చార్మ్ గా మారిపోయారు. ఈమె సినిమాల్లో ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అంటూ దర్శక నిర్మాతలు కూడా భావిస్తున్నారు.

పెళ్లి రూమర్లకు చెక్ పెట్టిన మమిత..

ఇలా వరుస సినిమాలో సక్సెస్ కావడంతో మమిత డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా బిజీ అవుతున్న తరుణంలో తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ల విషయంలో లవ్ రూమర్స్, పెళ్లి రూమర్స్ తరచూ బయటకు వస్తూ ఉంటాయి. అయితే మమిత పెళ్లికి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నో లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి..

Advertisement

ఇలా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పెళ్లి వార్తలపై మమిత స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన జీవితానికి సంబంధించి ఏ విషయం అయినా కూడా నిర్ణయం మాత్రం తన సోదరుడు మిథున్ బైజు తీసుకుంటాడు. మేమిద్దరం ఫ్రెండ్స్‌ కంటే బాగుంటాం. నా పెళ్లి విషయంలోనూ నిర్ణయం అతనిదే. నాకు ప్రతినిత్యం ఎన్నో లవ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. వీటిని చూసుకునేది కూడా తన సోదరుడే అంటూ ఈమె పెళ్లి రూమర్లపై స్పందిస్తూ ఈ వార్తలకు మొదట్లోనే చెక్ పెట్టారు. ఇలా తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం తన సోదరుడి చేతుల్లోనే ఉంటుందంటూ ఈమె చెప్పకనే చెప్పారు.

రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్…

ఇలా మమిత పెళ్లి రూమర్లపై స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పులి స్టాప్ పడినట్టు అయింది. ఇక ఈమె ప్రస్తుతం మలయాళ, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే తెలుగులోకి కూడా ఈమె ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు మాత్రం క్లారిటీ లేదు అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న జై హనుమాన్ సినిమాలో ఈమె ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు. ఇటీవల వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న మమిత ఒక్కో సినిమాకు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Advertisement

Also Read: బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!

Related News

నాని ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షూర్..ఫస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్ ఇవే!

అందరినీ నవ్వించిన కమెడియన్‌కు ఇంత కష్టమా? రామచంద్ర పరిస్థితి చూస్తే కన్నీళ్లే!

నవరాత్రి స్పెషల్.. ‘భరత వర్ష’ నుండి “అమ్మ కదిలి వచ్చే” సాంగ్ ప్రోమో రిలీజ్!

బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!

సింగర్ గా ఛాన్స్ కొట్టేసిన జిమ్ జిమ్ తార ఫేమ్ ఆంటీ …

రెండు ఎకరాలంటూ పృథ్వీరాజ్ సెటైర్లు.. కాస్ట్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×