E-Paper
Advertisement

బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!

బ్రేకప్ అంటే ఎదుగుదల.. వైరల్ అవుతున్న అనుపమ కామెంట్స్!
Advertisement

Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుపమ నటించిన క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam)సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లవ్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వ్యక్తిగత జీవితాన్ని కంట్రోల్ చేసేవాడు..

అనుపమ పరమేశ్వరన్ గత కొంతకాలంగా ఒక హీరోతో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఈమె తన మాజీ ప్రియుడు తన పట్ల విచిత్రంగా ప్రవర్తించేవాడని వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాలలో కూడా తనని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు అంటూ ఈమె ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇలా తన ప్రియుడు చర్యల పట్ల అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ చెప్పుకున్నారు. తాజాగా క్రేజీ కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె మరోసారి బ్రేకప్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రేమలో విఫలమైతే ధైర్యంగా నిలబడాలి..

Advertisement

ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమలో పడటం ఆ తర్వాత మన పార్ట్నర్ తో విడిపోవడం అనేది సహజంగా జరిగే విషయమని తెలిపారు. ఇలా మన జీవితంలో ఒక బంధం ముగిసిన తర్వాత ఆ వ్యక్తి నుంచి మనం ఎలా దూరమవుతామో ఆ తర్వాత వచ్చే రోజుల్లో మనల్ని మనం మెరుగుపరచుకొని ఒక మంచి వ్యక్తిగా ఎదగడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. అందుకే నా జీవితంలో బ్రేకప్(Breakup) అనేది బాధ కాదని అది ఒక ఎదుగుదల అంటూ ఈమె తెలిపారు. ప్రేమలో విఫలమైన ధైర్యంగా నిలబడి మన జీవితాలను మరింత అందంగా మలుచుకోవాలని సూచించారు.

ధ్రువ్ విక్రమ్ తో బ్రేకప్..

ఇలా బ్రేకప్ గురించి అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ కామెంట్స్ పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా లవ్ బ్రేకప్ అయిన తర్వాత ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్లి కెరియర్ పై ఫోకస్ చేయడం తగ్గిస్తూ ఉంటారు కానీ అనుపమ మాత్రం బ్రేకప్ నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకొని వాటిని జీవితంలో ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్న తీరు పట్ల అనుపమ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈమె గతంలో ప్రముఖ నటుడు ధృవ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించే లోపు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.

Advertisement

Also Read: సింగర్ గా ఛాన్స్ కొట్టేసిన జిమ్ జిమ్ తార ఫేమ్ ఆంటీ …

Related News

నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

సింగర్ గా ఛాన్స్ కొట్టేసిన జిమ్ జిమ్ తార ఫేమ్ ఆంటీ …

రెండు ఎకరాలంటూ పృథ్వీరాజ్ సెటైర్లు.. కాస్ట్ ఈవెంట్‌లో నవ్వులే నవ్వులు!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీకాంత్ కుమార్తె మేధా… పూర్తి డీటెయిల్స్ ఇవే!

లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ సినిమాపై బిగ్ అప్డేట్.. ఆ వార్తలకు చెక్ పెట్టారుగా!

స్నిగ్ధ లెస్బియనా కాదా? చివరకు అసలు విషయం చెప్పేసిందిగా!

బాలయ్య ఇల్లు కూల్చివేత.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు కనుమరుగు

Big Stories

Advertisement
×