E-Paper
Advertisement

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!
Advertisement

Airtel Plans: మొబైల్ బిల్లుల మోతతో సతమతమవుతున్న వినియోగదారులకు ఎయిర్‌టెల్ మరోమారు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలను పెంచుతూ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. అయితే ధరల పెంపుతో పాటు వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొన్ని ఉచిత ప్రయోజనాలను కూడా ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ కొత్త ప్లాన్లు అమల్లోకి వచ్చాయి.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరల పెంపు

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను రూ.50 మేర పెంచింది. అంటే వినియోగదారులు ఏడాదికి అదనంగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెంపుతో పాటు కంపెనీ కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కూడా ప్రకటించింది. ఇకపై పోస్ట్‌పెయిడ్ సిమ్‌లకు సంవత్సరానికి ఒకసారి ఉచిత అంతర్జాతీయ రోమింగ్ సౌకర్యం లభించనుంది.

అత్యంత చౌకైన ఎయిర్‌టెల్ ప్లాన్

Advertisement

ఎయిర్‌టెల్ వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 499 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, డేటా యూజర్లకు లభిస్తాయి. అలాగే స్పామ్, ఫేక్ మెసేజ్‌ల నుంచి రక్షణ, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, గూగుల్ వన్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ప్లాన్లు

కుటుంబం మొత్తం కోసం పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఎయిర్ టెల్ పలు ఆప్షన్‌లను అందిస్తోంది. రూ. 749 ప్లాన్ (2 సిమ్‌లు), రూ. 1,049 ప్లాన్ (3 సిమ్‌లు), రూ. 1,249 ప్లాన్ (4 సిమ్‌లు), రూ. 1,449 ప్లాన్ (4 సిమ్‌లు), రూ. 1,799 ప్లాన్లను (5 సిమ్‌లు) కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్లను బట్టి అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఐక్లౌడ్, నెట్‌ఫ్లిక్స్ వంటి సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ ఎంచుకునే ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి.

అంతర్జాతీయ రోమింగ్ కాలింగ్

Advertisement

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన అత్యంత కీలకమైన మార్పు.. ఉచిత అంతర్జాకీయ రోమింగ్ కాలింగ్. సంవత్సరానికి ఒకసారి ఐదు రోజుల పాటు ఫ్రీ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ ను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఈ ప్యాక్ కింద 5 జీబీ డేటా, 60 నిమిషాల టాక్‌టైమ్, 25 అవుట్‌గోయింగ్ ఎమ్‌ఎంఎస్‌లు, 1 ఇన్‌కమింగ్ ఎమ్‌ఎంఎస్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. విదేశాలకు వెళ్లే సమయంలో కస్టమర్లు ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Also Read: రూ. 50,000 ఉంటే చాలు.. రేపే ఈ వ్యాపారాలు స్టార్ట్ చేయెుచ్చు.. రూ.లక్షల్లో ఆదాయం!

పాత కస్టమర్లు ఏం చేయాలి?

ఎయిర్‌టెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కూడా కొత్త ప్లాన్లకు అప్‌గ్రేడ్ కావచ్చు. ఎయిర్‌టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దాదాపు నెల రోజుల్లో వారి ప్రస్తుత ప్లాన్‌కు దగ్గరగా ఉండే మరో ప్లాన్‌కు మారుస్తారు.

Also Read: ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!

 

Tags

Related News

కొత్త ఫోన్ కొన్న తర్వాత ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి? అసలు నిజం ఇదే!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో..అదిరిపోయే డిష్‌వాషర్లు,ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు

మెుబైల్ పాస్‌వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోయారా? ఆందోళన వద్దు.. ఇంట్లోనే ఇలా అన్‌లాక్ చేయండి!

జియో సూపర్ డూపర్ ప్లాన్స్.. రూ. 449 vs రూ. 500.. దేని బెనిఫిట్స్ ఎంత?

సీసీ కెమెరా కొనాలనుకుంటున్నారా ?ఈ మోడల్స్‌ని మించినవి లేవు తెలుసా?

నో గ్యాస్.. నో స్మోక్.. బొగ్గుతో పనిచేసే ఎలక్ట్రిక్ కోల్ బర్నర్.. నిజంగా అదిరిపోయింది మామ!

Big Stories

Advertisement
×