Star Actress: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు పూర్తిస్థాయిలో కెరియర్ పై దృష్టి సారిస్తూ పెళ్లికి కాస్త దూరంగా ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత అవకాశాలు తగ్గిపోతాయన్న ఉద్దేశంతో అవకాశాలు వస్తున్న సమయంలోనే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తున్న ఒక హీరోయిన్ మాత్రం కాలికి మెట్టెలతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు? ఇలా కాళ్లకు మెట్టలు ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అసలు ఎందుకు ఈమె ఇలాంటి ఫోటో షేర్ చేశారు? కొంపదీసి పెళ్లి చేసుకుందా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వెండితెర తెలుగు సీతమ్మ..
ఇలా కాలికి మెట్టెలతో దర్శనమిచ్చిన ఆ ముద్దుగుమ్మ ఎవరు? ఏంటీ? అని విషయానికి వస్తే ఆ బ్యూటీ మరెవరో కాదు మన సీత అని చెప్పాలి. సీతారామం(Sitaramam) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సీతగా పరిచయమైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపించే ఈమె తాజాగా కాలికి మెట్టెలతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేశారు. దీంత ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈమె కాలికి మెట్టలు పెట్టుకోవడం ఒక సినిమా షూటింగ్లో బాగామని స్పష్టం అవుతుంది.
కాళ్లకు మెట్టెలతో..
ప్రస్తుతం మృణాల్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలకు కూడా కమిట్ అయ్యారు త్వరలోనే ఈమె హీరో అడివి శేష్(Adivi sesh) నటించిన డెకాయిట్(Dacoit) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా తాజాగా హైదరాబాద్ చేరుకున్న ఈమె ఈ ఫోటో షేర్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూట్‌లో జాయిన్ అయిన విషయాన్ని చిత్ర బృందం తెలియజేశారు. పచ్చని గడ్డిలో మెట్టెలు పెట్టుకున్న తన కాళ్లు మాత్రమే కనిపించేలా ఉన్న ఓ ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేయటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
క్రిస్మస్ కానుకగా డెకాయిట్…
ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా, థ్రిల్ గా కూడా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె పెళ్లయిన అమ్మాయి పాత్రలో గృహిణిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.ఈ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాని క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఇక మృణాల్ చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే డెకాయిట్ సినిమా ద్వారా రాబోతున్నారు.
Also Read: Allu Arjun: మీ యాంకరింగ్ రప్పా.. రప్పా.. బన్నీ పొగడ్తలతో గాల్లో తేలుతున్న యాంకర్?