BigTV English

Actress Pakeezah: అడుక్కునే దుస్థితికి చేరుకున్న సీనియర్ నటి.. సీఎం అయినా ఆదుకోవాలంటూ!

Actress Pakeezah: అడుక్కునే దుస్థితికి చేరుకున్న సీనియర్ నటి.. సీఎం అయినా ఆదుకోవాలంటూ!

Actress Pakeezah: పాకీజా.. అలియాస్ వాసుగి గురించి నాటితరం ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ గారి పెళ్ళాం’ వంటి చిత్రాలలో బ్రహ్మానందం (Brahmanandam), పాకీజా(Pakeezah ) మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలకే హైలెట్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాల తర్వాత చాలా సినిమాలలో అవకాశాలు లభించాయి. తెలుగు ప్రేక్షకుల ఆదరణతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న పాకీజా ఇప్పుడు అడుక్కునే దుస్థితికి చేరుకుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


అడుక్కునే దుస్థితికి చేరుకున్న పాకీజా..

అసలు విషయంలోకి వెళ్తే.. 1990లో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఈమె.. అసెంబ్లీ రౌడీ సినిమాలోని పాకీజా క్యారెక్టర్ తో బాగా ఫేమస్ అయిపోయింది . కామెడీ రోల్స్ తో తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు దీనమైన పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పూట గడవని పరిస్థితిలో భిక్షాటన చేసే పరిస్థితికి చేరుకుంది. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు చెన్నై నుండీ వచ్చిన ఈమెను గుంటూరులో మీడియా ప్రతినిధులు పలకరించగా తన కష్టాలను చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం తమిళనాడులో తనకి ఎవరు సహాయం చేయడం లేదని, అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లు సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) లను కలిసి తన సమస్యను చెప్పుకోవాలనుందని తెలిపింది పాకీజా.


పూట గడవడం లేదంటూ పాకీజా ఎమోషనల్..

పూట గడవడం కూడా కష్టంగా ఉందని, కొన్ని కొన్ని సార్లు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తన పరిస్థితి గురించి వీడియోలు తీసి తమిళ సినీ పెద్దలందరికీ పంపినా ఎవరు స్పందించలేదని ఎమోషనల్ అయింది. తాను తమిళ్ నటి అయినప్పటికీ తెలుగు సెలబ్రిటీలు తనను బాగా ఆదుకున్నారు అని.. నాగబాబు, చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాలు స్పందించి, తనకు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది పాకీజా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో వాళ్లే గనుక ఆదుకోకపోయి ఉండి ఉంటే..ఈరోజు తాను చనిపోయి ఉండేదాన్ని అని కూడా తెలిపింది.

ఏపీ ముఖ్యమంత్రిను వేడుకుంటున్న పాకీజా..

పాకీజా మాట్లాడుతూ.. “తెలుగువారు నన్ను ఆదరించి, నాకు సినిమాలలో అవకాశం ఇచ్చి, అన్నం పెట్టారు. ఇప్పుడు అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పందించి ఆదుకోవాలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను కలిసి నా గోడును వినిపించుకోవాలని ఉంది. నాకు ఫించన్ సౌకర్యం కల్పిస్తే ఉన్నంతకాలం వారి పేరును చెప్పుకొని బ్రతుకుతాను. అవసరమైతే నా ప్రాణం ఉన్నంతవరకు వారి కోసం ఊరూరు తిరిగి ప్రచారం కూడా చేస్తాను. ఇదే నేను వారితో చెప్పాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపింది వాసుకి.

పాకీజా సినిమాలు..

పాకీజా కెరియర్ విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు వాసుగి. తమిళనాడులోని శివగంగై జిల్లా కారైకుడిలో జన్మించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత రౌడీ గారి పెళ్ళాం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, పెదరాయుడు, చిట్టెమ్మ మొగుడు, రౌడీ ఎమ్మెల్యే ,అన్నమయ్య, అమ్మా రాజీనామా, సీతారత్నం గారి అబ్బాయి వంటి చిత్రాలలో నటించింది.

పాకీజా రాజకీయ జీవితం..

ఇక అప్పటి దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పిలుపుమేరకు తమిళ్ రాజకీయాల్లో చేరి సినిమాలకు దూరమైంది. అన్నా డిఎంకె అధికార ప్రతినిధిగా ఉన్న ఈమె రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.

భర్త ఆత్మహత్య.. ఇంట్లో నుండి గెంటేసిన అత్తమామలు..

తమ పెళ్లి ఇష్టం లేని అత్తమామలు హింసించారని, భర్త కూడా మద్యానికి బానిస అయ్యి..డబ్బు, బంగారం వృధా చేశారని , ఆ తర్వాత కొంతకాలానికి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అంతేకాదు ఇంటి నుండి తన అత్తమామలు గెంటేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది పాకీజా. ఇక అత్తమామలు తరిమేయడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్తే.. తండ్రి చనిపోయారని , తల్లి క్యాన్సర్ తో పోరాడిందని, ఆమె ట్రీట్మెంట్ కోసం డబ్బులు అన్ని ధార పోసాను అని తెలిపింది. మరి పాకీజా దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ముఖ్యమంత్రి స్పందిస్తారేమో చూడాలి .

ALSO READ:Adah Sharma: దెయ్యంలా మారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Related News

Boyapati Sreenu: అఖండ 2 విడుదలపై బోయపాటి క్లారిటీ … కథ మొత్తం దాని చుట్టే అంటూ!

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేనేజన్ అరెస్ట్

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Big Stories

×