BigTV English

Adah Sharma: దెయ్యంలా మారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Adah Sharma: దెయ్యంలా మారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Adah Sharma: అదా శర్మ (Adah Sharma).. ప్రముఖ డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో నితిన్ (Nithin) హీరోగా వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమానే డిజాస్టర్ అయినప్పటికీ.. తన అందంతో, అమాయకత్వంతో, నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా అవకాశం వచ్చినా అంతగా గుర్తింపు రాలేదు. ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా నటించింది. ఇక ఇక్కడ అవకాశాలు తగ్గుతున్న క్రమంలో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె..అక్కడ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


కొత్త సినిమా ప్రకటించిన అదా శర్మ..

ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి విడుదలకు ముందే వివాదాలలో చిక్కుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత కూడా అదే జానర్ చిత్రాలను ఎంచుకుంది. కానీ ఆ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇక ప్రస్తుతం హిందీ, తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈమె తాజాగా తన కొత్త సినిమాను కూడా ప్రకటించింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని పంచుకుంది అదా శర్మ.


దెయ్యంలా మారిన అదా శర్మ..

ఎప్పుడు అందంగా.. క్యూట్ గా.. అమాయకత్వంగా కనిపించే అదాశర్మ తొలిసారి దెయ్యం లా మారిపోయింది. తన తర్వాత సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పంచుకుంటూ..” నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గా హార్రర్ సినిమాకి సంతకం చేయాలా?” అంటూ అభిమానులను అడుగుతూ ఒక వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోలో దెయ్యం గెటప్ లో అదా శర్మ కి స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో భిన్న భిన్నమైన ఎక్స్ప్రెషన్స్ తో దెయ్యంలా మారిపోయి అందర్నీ భయపెట్టేసింది. ఈ వీడియో చూస్తూ ఉంటే అదా శర్మ నెక్స్ట్ మూవీ డెవిల్ గా హార్రర్ జానర్లో రాబోతోంది అని తెలుస్తోంది. ఇన్ని రోజులు అమాయకత్వంతో తన అందంతో ఆకట్టుకున్న ఈమె ఒక్కసారిగా దెయ్యంలా మారబోతోంది. మరి అభిమానులు ఈమెను ఈ యాంగిల్ లో యాక్సెప్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

భారీ క్రేజ్.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం..

అదా శర్మ విషయానికి వస్తే.. ది కేరళ స్టోరీ సినిమాతో రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, భారీ క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉండడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Raj put) ఇంట్లో అద్దెకు దిగింది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడైతే అతడు సూసైడ్ చేసుకొని చనిపోయాడో.. అదే ఫ్లాట్లో అద్దెకు ఉంటుంది. నెల నెల రెంట్ పే చేస్తోంది. ఇక ఇంత క్రేజ్ ఉండి కూడా ఇప్పటికీ అద్దె ఇంట్లో జీవనం అందులోనూ హీరో చనిపోయిన ఇంట్లోనే అద్దెకు దిగడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు అభిమానులు.

ALSO READ:Raj Tarun – Lavanya: లావణ్య – రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిజ స్వరూపం బయటపెట్టిన హైకోర్టు!

?utm_source=ig_web_copy_link

Related News

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Madharaasi : మదరాసి సినిమా కథ చెప్పేసిన మురగదాస్, ఏకంగా గజినీ రేంజ్

Coolie: కూలీ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ రావడం వెనక కారణం ఇదే

Mass Jathara: ఆగస్టు నుంచి తప్పుకున్న మాస్ జాతర… విడుదల అప్పుడేనా?

Big Stories

×