E-Paper
Advertisement

పక్కా ఊరోడిని పెళ్లి చేసుకున్నా..కిరణ్ అబ్బవరంతో పెళ్లి పై రహస్య కామెంట్స్ వైరల్!

పక్కా ఊరోడిని పెళ్లి చేసుకున్నా..కిరణ్ అబ్బవరంతో పెళ్లి పై రహస్య కామెంట్స్ వైరల్!
Advertisement

Rahasya Gorak: రహస్య గోరక్ పరిచయం అవసరం లేని పేరు . నటిగా పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె నటుడు కిరణ్ అబ్బవరాన్ని(Kiran Abbavaram) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ గత రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. వీరిద్దరూ మొట్టమొదటిసారి రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ప్రేమలో పడిన వీరిద్దరూ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.

నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం..

పెళ్లి తర్వాత రహస్య(Rahasya) సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తెరు వెనుక ఉంటూ సినిమా బాధ్యతలను తీసుకుంటున్నారు. కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే నిర్మాణ పనులకు సంబంధించిన బాధ్యతలను రహస్య చూసుకుంటున్నారు. కిరణ్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇక ఈయన నిర్మాతగా మారి తిమ్మరాజు పల్లి టీవీ (Timmaraju Palli Tv)అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

హైదరాబాదులో పుట్టి పెరిగినా కానీ..

Advertisement

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరంతోపాటు రహస్య కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రహస్య మాట్లాడుతూ.. తాను హైదరాబాదులోనే పుట్టి పెరిగాను అయితే పెళ్లి మాత్రం పక్క ఊరోడిని పెళ్లి చేసుకున్నాను అంటూ కిరణ్ అబ్బవరంతో పెళ్లి గురించి మాట్లాడారు. తాను హైదరాబాదులో పుట్టి పెరిగినప్పటికీ పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ జీవన విధానాలు ఎలా ఉంటాయని నాకు తనని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందని అయితే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పటి జనరేషన్ పిల్లలు మిస్ అవుతున్నారని రహస్య తెలిపారు.

పాత జ్ఞాపకాలను గుర్తు చేసేలా తిమ్మరాజు పల్లి టీవీ..

Advertisement

ఇలా పల్లెటూరి జ్ఞాపకాలను మిస్ అవుతున్న వారందరూ కూడా తప్పకుండా మా తిమ్మరాజు పల్లి టీవీ సినిమాకు రండి కచ్చితంగా మీకు ఆ అనుభవాన్ని కలిగిస్తుందని, 90 లలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూస్తూ వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారని కచ్చితంగా మీ అందరికీ మా సినిమా నచ్చుతుంది అంటూ రహస్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఒక పల్లెటూరిలో ఒకే ఇంట్లో టీవీ ఉంటే గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్లి కలిసికట్టుగా సినిమా చూడటం, టీవీ కారణంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవలు వంటి నేపథ్యంలోనే సినిమా ఉండబోతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా ద్వారా పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు రావడం పక్కా అంటూ ట్రైలర్ తోనే చూపించారు. మరి ఏప్రిల్ 17న రాబోతున్న తిమ్మరాజు పల్లి టీవీ సినిమా నిర్మాతగా కిరణ్ అబ్బవరంకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: కిరణ్ అబ్బవరాన్ని పవన్ కళ్యాణ్ తో పోల్చిన నటుడు అమ్మ రమేష్.. ఏమైందంటే?

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×