E-Paper
Advertisement

భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Ramya Krishna: రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు. సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవల ఈమె రజనీకాంత్ తో కలిసి జైలర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల రమ్యకృష్ణ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కృష్ణవంశీ రమ్యకృష్ణ విడాకులు తీసుకున్నారా..

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నేను కృష్ణవంశీ ఇప్పటికీ భార్యా భర్తలమే కానీ వేరువేరుగా ఉంటూ సంతోషంగా గడుపుతున్నామని తెలిపారు. కేవలం కెరియర్ పరంగా మాత్రమే మేము విడిగా ఉండాల్సి వచ్చిందని రమ్యకృష్ణ తెలిపారు. ముఖ్యంగా మా అబ్బాయి జన్మించిన సమయంలో తాను పూర్తిగా తన కొడుకుకు దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో సీరియల్స్ తో బిజీగా ఉండటం వల్ల తాను 15 రోజులకు ఒకసారి మాత్రమే వెళ్ళేదాన్ని ఈమె తెలిపారు.

పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ బెటర్..

Advertisement

ఇలా 15 రోజులకు ఒకసారి వెళ్లి రావటం వల్ల తన కొడుకుకు బాగా అనారోగ్యం చేసిందని, అందుకే మా బాబును కూడా తనతో పాటు చెన్నైకి తీసుకెళ్లి అక్కడే చదివిస్తానని కృష్ణవంశీకి చెప్పాను. ఇద్దరికీ ఈ ఆలోచన సమ్మతంగా ఉండడంతో ఒకే చెప్పారు. కృష్ణ వంశీ గారు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు.. కలిసి ఉండి రోజు గొడవ పడటం కంటే మంచి ఫ్రెండ్స్ లా ఉంటాము నిజానికి పెళ్లి కంటే కూడా లివింగ్ టు గెదర్ ఉందామని కృష్ణవంశీ అప్పుడే చెప్పారు. ఆయన అలా చెప్పినప్పుడు నేను ఓకే చెప్పి ఉండాల్సిందని నవ్వుతూ చెప్పారు.

సినిమాలే ఆయన ప్రపంచం..

కృష్ణవంశీ గారి ఆలోచనలు ఎల్లప్పుడూ సినిమా గురించే.. సినిమాలే ఆయన ప్రపంచం. ఆయన నా విషయాలలో ఇన్వాల్వ్ కారు, నేను కూడా ఆయన విషయాలలో ఏమాత్రం ఇన్వాల్వ్ కానని రమ్యకృష్ణ తెలిపారు. ప్రస్తుతం నేను ఆయన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అంటూ కృష్ణవంశీ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా రమ్యకృష్ణ తన భర్త నుంచి వేరుగా ఉంటున్నానని చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా వీరి విడాకుల గురించి కూడా వార్తలు తెరపైకి వచ్చాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈమె ఇద్దరం వేరుగా ఉంటున్నామని చెప్పడంతో కచ్చితంగా విడాకులు తీసుకుని విడిపోయారని, అందుకే వేరుగా ఉంటున్నారని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Also Read: గిరిబాబు మరణం…అందరికీ క్షమాపణలు చెప్పిన రఘు బాబు..ఏం జరిగిందంటే?

Related News

గిరిబాబు మరణం…అందరికీ క్షమాపణలు చెప్పిన రఘు బాబు..ఏం జరిగిందంటే?

దుల్కర్ వర్సెర్ సౌమిత్ ..ఓకె కథతో రెండు సినిమాలు…టాలీవుడ్ లో కాపీ వివాదం!

పవన్ తేజ్ కొణిదెల హీరోగా ‘జనతా’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో!

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×