Pawan Tej Konidela: మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఎంతమంది హీరోలుగా మంచి సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో పవన్ తేజ్ కొణిదెల(Pawan Tej Konidela) ఒకరు. చిరంజీవి సోదరుడు కుమారుడిగా నేను కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరంజీవి పవన్ తేజ్ కు వరసకు బాబాయ్ అవుతారని సంగతి మనకు తెలిసిందే. ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా అడపాదడపా సినిమాలలో నటిస్తున్న పవన్ తేజ్ తాజాగా మరొక కొత్త సినిమాను ప్రకటించారు.
ఆకట్టుకుంటున్న జనతా ఫస్ట్ లుక్ పోస్టర్..
ఈయన రాజశేఖర్ యాదవ్(Rajasekhar Yadav) దర్శకత్వంలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా చిత్రం ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘జనతా'(Janata) అనే టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ తేజ్ పాత్ర సామాన్య ప్రజల హక్కులు, పోరాటం కోసం తిరుగుబాటు చేసే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
తిరుగుబాటు నేపథ్యంలో జనతా..
ఇలా ఈ సినిమా తిరుగుబాటు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలతో హీరో తిరుగుబాటు చేయబోతున్నారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇలా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయడంతో సినిమాపై మంచిగా అంచనాలు ఉన్నాయి . ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ కూడా తెలియనుంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర బృందం అధికారకంగా వెల్లడించనున్నారు.
ఇప్పటికే మెగా హీరోలు ఇండస్ట్రీలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పవన్ తేజ్ నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఇదివరకు సినిమాల కంటే చాలా విభిన్నంగా జనతా సినిమాలో ఈయన కనిపించబోతున్నారని తెలుస్తుంది. మరి జనతా సినిమా ద్వారా పవన్ తేజ్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలను టీజర్, ట్రైలర్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అధికారకంగా ప్రకటించబోతున్నారు.
Also Read: బిగ్ బాస్ 10 ఈ వారం ఎలిమినేట్ అయిన లేడి కంటెస్టెంట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?