E-Paper
Advertisement

గిరిబాబు మరణం…అందరికీ క్షమాపణలు చెప్పిన రఘు బాబు..ఏం జరిగిందంటే?

గిరిబాబు మరణం…అందరికీ క్షమాపణలు చెప్పిన రఘు బాబు..ఏం జరిగిందంటే?
Advertisement

Raghu Babu Apology: సినీ నటుడు గిరిబాబు మరణించిన సంగతి తెలిసిందే. 80 సంవత్సరాల వయసులో ఈయన వృద్ధాప్యం సమస్యలతో బాధపడుతూ నవంబర్ 14వ తేదీ మరణించారు. ఈ విధంగా గిరి బాబు మరణించడంతో ఆయనని సినీ సెలబ్రిటీలు అభిమానుల సందర్శనార్థం గత రాత్రి 6 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. ఇలా రెండు గంటలు మాత్రమే ఆయన పార్థివ దేహం అక్కడ ఉంచినప్పటికీ పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు చేరుకొని తనకు నివాళులర్పించారు.

క్షమాపణలు కోరిన రఘుబాబు..

ఈ విధంగా గిరిబాబు (Giri Babu)పార్థివ దేహాన్ని తన స్వగ్రామానికి తీసుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు రఘుబాబు(Raghu Babu) మీడియాతో మాట్లాడారు . ఈ మీడియా సమావేశంలో భాగంగా రఘుబాబు అందరికీ క్షమాపణలు తెలియజేశారు. నాన్నగారిని చివరి చూపు చూడటం కోసం అందరూ వస్తున్నారు అయితే సమయం లేకపోవడం వల్ల మా సొంత గ్రామానికి వెంటనే తీసుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్షమించాలి అంటూ మీడియా మిత్రులకు సెలబ్రిటీలకు అభిమానులకు ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు.

నాన్న చివరి కోరిక అదే..

Advertisement

ఇక గిరిబాబు మరణించడంతో ఆయన అంత్యక్రియలను తమ స్వగ్రామంలోనే నిర్వహించాలని తన తండ్రి కోరినట్టు ఈ సందర్భంగా రఘు బాబు తెలియచేశారు. రఘు బాబు ప్రకాశం జిల్లా రావినూత గ్రామంలో జన్మించారు. ఇక ఈయన మరణించడంతో తన స్వగ్రామంలోనే అంత్యక్రియలో నిర్వహించాలని తన తండ్రి కోరారని, తన తండ్రి ఆఖరి కోరిక ఇదే అంటూ రఘుబాబు ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా తన తండ్రి అనారోగ్య సమస్యల గురించి కూడా ఈ సందర్భంగా రఘుబాబు మాట్లాడారు.

శ్వాస కోసం సంబంధిత వ్యాధి..

తన తండ్రి గత కొద్ది నెలలుగా ఆల్జీమర్స్ అలాగే శ్వాస కోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని రఘు బాబు తెలిపారు. శనివారం ఉన్న ఫలంగా బీపీ, షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడంతోని తన తండ్రి మరణించారని రఘు బాబు తన తండ్రి మరణానికి కారణాలను తెలియజేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన పార్తివదేహాన్ని తన సొంత గ్రామానికి తీసుకువచ్చారు మధ్యాహ్నం మూడు గంటల తరువాత గిరిబాబు అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక గిరిబాబు దాదాపు 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన సంగతి తెలిసిందే .సుమారు 600కు పైగా సినిమాలలో నటుడిగా, విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శక నిర్మాతగా కూడా సేవలు అందించారు. ఇక ఈయన చివరిగా అన్ని మంచి శకునములే అని సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత వెండితెరకు గిరిబాబు దూరమయ్యారు.

Advertisement

Also Read: దుల్కర్ వర్సెర్ సౌమిత్ ..ఓకె కథతో రెండు సినిమాలు…టాలీవుడ్ లో కాపీ వివాదం!

Related News

దుల్కర్ వర్సెర్ సౌమిత్ ..ఓకె కథతో రెండు సినిమాలు…టాలీవుడ్ లో కాపీ వివాదం!

పవన్ తేజ్ కొణిదెల హీరోగా ‘జనతా’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో!

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!

Big Stories

Advertisement
×