Samantha New Pics : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత (Samantha). ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది ఇలా పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించి.. తెలుగునాట ప్రముఖ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. తెలుగులోనే కాదు అటు తమిళ్లో కూడా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత..
కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నాగచైతన్య తో ‘మజిలీ’ సినిమా చేసిన ఈమె అనూహ్యంగా నాలుగేళ్లకే అతడి నుండి విడిపోయింది. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా సమంత నాగచైతన్య నుండి విడిపోవడానికి కారణం ప్రీతమ్ జుకాల్కర్ అనే స్టైలిస్ట్ పేరు ప్రథమంగా వినిపించింది. అతడు తనకు సమంత అక్క లాంటిదని చెప్పినా సరే ఒక వర్గం ప్రేక్షకులు నమ్మకపోగా.. లేనిపోని నిందలు వేశారు. అలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంది సమంత. అయితే ఆ సమయంలో సమంతకు ఎంతో మంది అభిమానులు అండగా నిలిచారు. దీనికి తోడు ఆమె మయోసైటిస్ వ్యాధి భారిన పడింది అప్పుడు కూడా సమంతకు అండగా ఆమె వైపే మాట్లాడారు.
గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఫోటోషూట్..
ఇకపోతే అలా ఒంటరిగా కెరియర్ కొనసాగించాలనుకున్న సమంత.. అనూహ్యంగా బాలీవుడ్ బాట పట్టింది. ఇక అక్కడ వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరించాలనుకుంది. కానీ ఎవరు ఊహించని విధంగా ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ల దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj nidimoru) తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతోంది అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు సమంత ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్ చూసి ఈమెపై విమర్శలు మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సమంత ఫోజులిచ్చింది. దీనికి తోడు అటు గ్రాజియా మ్యాగజైన్ కూడా 15 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటారు అంటూ సమంత పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Sammu 🥵
Thalavii Samantha 🛐#SamanthaRuthPrabhu #Samantha #SamanthaRuthPrabhu𓃵 pic.twitter.com/YHhnFzZf6v— Actress World (@aactress_world) August 19, 2025
వేషధారణపై ఫ్యాన్స్ ఫైర్..
ఇకపోతే తాజాగా ఈ మ్యాగజైన్ విడుదల చేసిన ఫోటోలు చూసి అభిమానులు సైతం సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కి వెళ్ళావా లేక బి గ్రేడ్ కి వెళ్ళావా ఆ ఫోజులేంటి అంటూ సమంత పై ట్రోల్స్ చేస్తున్నారు. వాస్తవానికి సమంత లైఫ్ జర్నీ అంటే చాలామందికి ఇష్టం. నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు కూడా ఆమెకు అండగా నిలిచారు. అలాంటి సమంతను ఇప్పుడు ఇలాంటి దుస్తుల్లో అలాంటి ఫోజుల్లో చూడలేకపోతున్నారు అభిమానులు. దీంతో ఆమెపై చాలామంది ట్రోల్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. మరి సమంత అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇకపై ఇలాంటి ఫోటోషూట్ నిర్వహించకుండా ఉంటుందేమో చూడాలి.
ALSO READ : Nandamuri Padmaja : ముగిసిన పద్మజా అంత్యక్రియలు.. వదినకు కొడుకులా మారిన బాలయ్య!