Naga Vamsi Tweet: నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆయన ఈ మధ్య సైలెంట్ అయ్యారు. దానికి కారణం బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో తర్వాత ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాను షట్ డౌన్ చేసి.. దుబాయ్ వెళ్లిపోయారన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండపోయారంటూ జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియా ఎక్కడ చూసిన నాగవంశీ గురించే చర్చ. నిర్మాత నాగవంశీ ఎక్కడ అంటూ పోస్ట్స్ దర్శనం ఇచ్చాయి. తనపై వస్తున్న వార్తలపై తాజాగా నాగవంశీ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ వదిలారు.
నన్ను మిస్ అవుతున్నారా!
“ఏంటీ నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ అది, వంశీ ఇది అని నాపై కథలు రాస్తూ.. ఫుల్ హడావుడి చేస్తున్నారు. పర్లేదు ఎక్స్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. అయితే, మిమ్మల్ని అందరిని నిరాశ పరిచినందుకు క్షమించండి. కానీ ఇంకా ఆ టైం రాలేదు. మీరు అనుకున్న ఆ సమయం రావాలంటే మినిమమ్ పదేళ్ల నుంచి పదిహేను ఏళ్లు పడుతుంది. ఎల్లప్పుడు థియేటర్‌లోనే.. సినిమా కోసమే.. అతి త్వరలోనే మీ అందరిని మాస్ జాతరతో కలుస్తాను” అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. కింగ్‌డమ్, వార్ 2 ప్లాప్స్ వల్ల మాస్ జాతర మూవీ వాయిదా పడనుందనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు టీం నుంచి క్లారిటీ లేదు. కానీ, ఇప్పుడు నాగవంశీ ట్వీట్ చూస్తుంటే.. మాస్ జాతర వాయిదా పడినట్టే అనిపిస్తోంది.
మాస్ జాతర వాయిదా?
ఆగష్టు 27న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ, తన ట్వీట్ మాత్రం కమ్మింగ్ సూన్ అని నాగవంశీ పేర్కొన్నారు. దీంతో ట్రోలర్స్‌కి కౌంటర్ ఇస్తూనే.. మాస్ జాతర వాయిదాని కన్‌ఫాం చేశారంటున్నారు నెటిజన్స్. కాగా నాగావంశీ తన సినిమాల రిలీజ్ అంటే ఎక్కువగా మీడియా, సోషల్ మీడియాలోనే ఉంటారు. ఓ ప్రెస్‌మీట్స్, ఈవెంట్స్‌లో హడావుడి చేస్తూ.. మరోవైపు వరుస ట్వీట్స్‌తో మూవీపై హైప్ పెంచుతుంటారు. కానీ, రవితేజ ‘మాస్ జాతర’ మూవీ రిలీజ్‌కి ఇంకా వారం రోజులే ఉంది. కానీ, ఇప్పటి వరకు ఆయన సందడి కనిపించడం లేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌లో సినిమా రిలీజ్ అంటే నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలవుతాయి. కానీ, మాస్ జాతర రిలీజ్ టైంలో ఆయన సైలెంట్ అయ్యారు. దీనికి కారణం ఆయన బ్యానర్‌లో విడుదలైన కింగ్ డమ్, వార్ 2 సినిమా ఫ్లాప్.
Also Read: Nara Rohith: నేను ‘వార్ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వస్తున్న చిత్రాలేవి బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కావడం లేదు. కలెక్షన్ల వర్షం కురిపిస్తాయని ఆశపడ్డ కింగ్‌డమ్, వార్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యాయి. కింగ్‌డమ్ సితార బ్యానర్‌లో నిర్మితమైంది. వార్ 2 తెలుగు రైట్స్‌ని నాగవంశీ కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యి నష్టాలు ఇచ్చాయి. ఈ టైంలో మాస్ జాతర రిలీజ్ చేసి మరో నష్టాన్ని భరించలేమని, ఈ సినిమా వాయిదా వేయాలని బయ్యర్లు నాగవంశీని కోరారు. ప్రస్తుతం ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ వాయిదాకు రవితేజ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయినా కూడా బయ్యర్లు మూవీని కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో మాస్ జాతర చిత్రాన్ని ఆగష్టు 27 నుంచి వాయిదా వేయక తప్పలేదట నాగవంశీ.
Enti nannu chala miss avthunattu unnaru.. 😂
Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…
Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.
At the cinemas… for the cinema,…
— Naga Vamsi (@vamsi84) August 20, 2025