Nandamuri Padmaja : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా కుటుంబంగా పేరు సొంతం చేసుకున్న నందమూరి కుటుంబంలో నిన్న విషాదఛాయలు అలముకున్నాయి.. స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr NTR) పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ (Nandamuri Jaya Krishna) సతీమణి పద్మజ (Padmaja) పలు అనారోగ్య కారణాల వల్ల 73 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఈమె మరణం అటు నందమూరి కుటుంబాన్నే కాదు ఇటు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా శోకసంద్రంలో ముంచేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి.. బాలకృష్ణ (Balakrishna) సోదరి పురందేశ్వరి ఢిల్లీ నుంచి బయలుదేరి ఆమె పార్తివదేహాన్ని సందర్శించారు.
ముగిసిన నందమూరి పద్మజ అంత్యక్రియలు..
ఇక నందమూరి బాలకృష్ణ మొదలు చాలామంది కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమౌతూ ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ఇకపోతే పద్మజ అంత్యక్రియలు నేడు పూర్తయ్యాయి. మహా ప్రస్థానంలో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పద్మజా అంత్యక్రియలను పూర్తి చేశారు.. ఇకపోతే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ పద్మజ పాడేమోసి ఆమె రుణం తీర్చుకున్నారు. ముఖ్యంగా వదినకు కుమారుడిలా మారి ఆమె పాడే మోసారు. అనంతరం పద్మజా – జయకృష్ణ దంపతులకు కుమారుడు హీరో నందమూరి చైతన్య కృష్ణ(Nandamuri Chaitanya Krishna) వెన్నంటే ఉంటూ అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్ బాలయ్య గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నారు. బాలయ్య తన కుటుంబం కోసం నిత్యం అండగా ఉంటారు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో పద్మజా మృతి..
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పద్మజ బాధపడుతున్నట్లు సమాచారం. ఆగస్టు 19న ఫిలింనగర్ లోని తన నివాసంలో.. తెల్లవారుజామున ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి ఆమెను తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స తీసుకుంటూ పద్మజా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆమె మృతి అటు అభిమానులను ఇటు కుటుంబ సభ్యులను మరింత దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. ఇక హీరో చైతన్య కృష్ణ తల్లి మరణంతో అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. అంతేకాదు నందమూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
పద్మజ ఎవరంటే?
పద్మజా ఎవరో కాదు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సోదరి. అంటే దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి స్వయానా సోదరి అవుతుంది. వీరి ఇంట్లో కుండమార్పిడి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.
Balayya is always there for family. Can't see him like this 🥺💔#NandamuriBalakrishna pic.twitter.com/KiTq5JrMf4
— NBK Cult (@iam_NBKCult) August 20, 2025
Kutumbam lo ee kastam ochina ani thane oo pedha koduku la chuskuntadu 🙏
those who are trolling aa glasses gurinchi ayana last 2 days ga eye infection tho suffer avtunadu #NandamuriBalakrishna pic.twitter.com/95zXdFD4Fa
— 𝗦𝗶𝗺𝗯𝗮𝗧𝘄𝗲𝗲𝘁𝘀_𝗫 🦁 (@SAgamanam) August 20, 2025
ALSO READ:Naga Chaitanya: దేవర డైరెక్టర్‌తో కాదు కానీ.. దేవర నిర్మాతలతో నాగచైతన్య మూవీ ?