January 12na Vidudhala Movie:ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) తాజాగా మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ జనవరి 12న విడుదల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ‘బావా బామర్ది సౌజన్యంతో ‘ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. వెంకటేష్ (Venkatesh), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా కృతి శెట్టి(Krithi Shetty), కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టిన చిత్ర బృందం.. “డివికి డివికి డిక్కుమ్” అంటూ మొదటి పాటను విడుదల చేశారు.
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో గత ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో అసలైన సంక్రాంతి పండుగను థియేటర్లలో చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘జనవరి 12న విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో ‘ అనే సినిమా నుండి విడుదల చేసిన మొదటి లిరికల్ సాంగులో కృతి శెట్టి, కీర్తి సురేష్ వదిన మరదలుగా తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఈ పాటకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. అనంత శ్రీరామ్ లిరికల్స్ ఇచ్చారు. మధుప్రియ, హరిప్రియ తమ అద్భుతమైన గాత్రంతో పాటను ఆలపించారు.
ఇకపోతే కీర్తి సురేష్, కృతి శెట్టి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అభిమానులు కూడా ఈ కాంబోని తెరపై చూడడానికి తెగ ఎక్సైట్మెంట్ గా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ పాట లిరిక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ పాట కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి అప్పుడే కొంతమంది సెలబ్రిటీలు రీల్స్ చేయడం కూడా మొదలు పెట్టేశారు. మరి చూద్దాం యూట్యూబ్లో ఈ లిరికల్ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ALSO READ:కావ్య-అనిరుధ్ పెళ్లి.. ఉద్యోగులకు స్పెషల్ సర్ప్రైజ్?వీడియో వైరల్!
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో కృతి శెట్టి, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ తెలుగు ఫ్యామిలీ యాక్షన్ కామెడీ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జి స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బామ్మర్దిగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ , కృతి శెట్టి వదిన మరదల్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ లెఫ్ట్నెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా నటిస్తుండగా.. కృత్తి శెట్టి దీపు పాత్రలో నటిస్తున్నట్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక మిగిలిన వారు ఎవరెవరు ఇందులో నటిస్తున్నారు అనే విషయం త్వరలో తెలియనుంది.