Shahrukh Khan:షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) .. బాలీవుడ్ బాద్ షా గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. తన విలక్షణమైన నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా నార్త్ , సౌత్ అని తేడా లేకుండా అటు సెలబ్రిటీలను కూడా మెప్పించిన నటుడిగా రికార్డు సృష్టించారు షారుఖ్ ఖాన్. ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్నా.. వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తన సినీ కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన షారుఖ్ ఖాన్.. తొలిసారి 33 ఏళ్ల కల నెరవేరింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కి జాతీయ అవార్డు..
అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ అవార్డ్స్ జాబితాను ప్రకటించింది. 2025 శుక్రవారం ఆగస్టు 1 ప్రకటించిన ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో జాతీయ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ పేరును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023లో విడుదలైన ‘జవాన్’ సినిమాకి గానూ షారుక్ ఖాన్ ను బెస్ట్ యాక్టర్ గా గుర్తిస్తూ నేషనల్ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయంలో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.
షారుఖ్ ఖాన్ 33 ఏళ్ల కల నెరవేరింది..
ఇకపోతే బాలీవుడ్ తో పాటు ప్రపంచ సినీ రంగంలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు షారుక్ ఖాన్. 1992లో వచ్చిన ‘దీవానా’ అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి నేటి జనరేషన్ కి కూడా అభిమాన హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక 2023లో పఠాన్, జవాన్, డంకీ వంటి చిత్రాలతో రికార్డు సృష్టించారు. ఈ మూడు ప్రాజెక్టులు ఇండియాలో రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.2500 కోట్ల గ్రాస్ రాబట్టాయి. ఇక 33 ఏళ్ల సినీ కెరియర్ లో తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా 33 ఏళ్ల కల నెరవేరేసరికి అటు షారుఖ్ ఖాన్ కూడా పూర్తిస్థాయి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నట్లు సమాచారం.
షారుఖ్ ఖాన్ ప్రస్తుత సినిమాలు..
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ గా పిలవబడే షారుఖ్ ఖాన్ తన సినీ కెరియర్లో 100కు పైగా చిత్రాలలో నటించారు. 14 ఫిలింఫేర్ అవార్డులతో పాటు అనేక ప్రశంసలు అందుకున్నారు. అటు పద్మశ్రీ , ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్, లెజియన్ ఆఫ్ ఆనర్ వంటి అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు తొలిసారి నేషనల్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. మొత్తానికైతే షారుక్ ఖాన్ కల నేటితో నెరవేరింది అని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు అటు సినీ సెలెబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==