Illu Illalu Pillalu ToIlluday Episode August 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. సేటు రామరాజు అంటూ వస్తాడు. అది గమనించిన చందు అక్కడికి వచ్చి సేటును బ్రతిమలాడి పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన నర్మదా ఏంటి ప్రాబ్లం బావగారు అని అడుగుతుంది. నా జాబుకు సంబంధించినదని చెప్పాను కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అందరం కలిసి సాల్వ్ చేద్దామని నర్మదా అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఏంట్రా కంగారు పడుతున్నావ్.. ఏదైనా సమస్య? అసలు నువ్వు అమాయకుడివి ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. ఏం లేదు నాన్న అని చందు అంటాడు. నర్మదను కూడా ఈ విషయం గురించి మర్చిపో చిన్న విషయమే నేను చూసుకుంటాను అని అంటాడు.
శ్రీవల్లి దగ్గరికి వెళ్లిన చందు మీ నాన్న వాళ్ళు ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎంప్టీ చెక్కించి మోసం చేస్తారా..? ఇప్పుడే అక్కడికి వెళ్లి తేల్చుకుందాం పదండీ అని బలవంతంగా శ్రీవల్లిని లాక్కొని వెళ్తాడు. చందు బండి స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ పోదామని అంటాడు. ఎదురుగా నర్మద రావడం చూసి షాక్ అవుతుంది. ఏంటి బావగారు ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది. మా జోలికి రావొద్దని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ ను ఒక ఆట ఆడుకుంటుంది. ఉదయం లేవగానే ప్రేమ ఒక కాఫీ, టిఫిన్ అని ఆర్డర్ వేస్తుంది. చేసేదేమీ లేక నాలుగు కిలోమీటర్లు వెళ్లి టిఫిన్ తీసుకొని వస్తాడు. ఆఫీస్ కి వెళ్లేందుకు రెడీ అవుతున్న నర్మదదను చూసిన సాగర్.. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేసినా కూడా నర్మదా సాగర్ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళకి కోపం వస్తే ఆ కళ్ళతోనే చంపేస్తారేమో అంత మంటలు ఉన్నాయి అని సాగర్ అనుకుంటూ ఉంటాడు.. ఆఫీస్ కి వెళ్ళబోతున్న నర్మదా ప్రేమతో కలిసి శ్రీవల్లి వాళ్ళ అమ్మానాన్నని పిలిపించేందుకు ప్లాన్ చేస్తుంది.
శ్రీవల్లి అక్కడికి వచ్చి జీడిపప్పు ఉప్మా ని ఉప్మా రవ్వ కూడా లేకుండా తినేస్తానని వాళ్ళ చేతిలో ఉన్న గిన్నె తీసుకొని తినేస్తుంది. ప్రేమ నర్మదలు శ్రీవల్లిని ఆడుకుంటారు. బొద్దింక పడిన ఉప్మాని తింటే చచ్చిపోతారేమో కదా అని ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకోవడం విని శ్రీవల్లి షాక్ అవుతుంది.
అయ్య బాబోయ్.. ఏంటి బొద్దింకపడిన ఉప్మాని నేను తినేసానా అని శ్రీవల్లి షాక్ అవుతుంది. మమ్మల్ని ఆడుకోవాలని చూస్తావా అందుకే నిన్ను ఆడుకున్నామని నర్మదా ప్రేమ అంటారు. శ్రీవల్లి చచ్చిపోతానేమో అని భయంతో బయటికి వెళ్లి వాంతులు చేసుకుంటుంది. ఈ విషయం ఎలాగైనా అందరికీ చెప్పాలని ప్రేమ నర్మదా ఇద్దరు కూడా శ్రీవల్లి అక్క వాంతులు చేసుకుంటుంది రండి చూడండి తల్లి కాబోతుందేమో అని అంటారు. ఆ మాట వినగానే అందరూ అక్కడికి వచ్చి చూసి ఇన్నాళ్లకు నా ఇంట్లో మనోడు తిరగబోతున్నారంటూ వేదవతి సంతోషపడుతుంది.
ఇంట్లోనే వాళ్ళందరూ కూడా శ్రీవల్లి తల్లి కాబోతుందని ఆనందంగా ఉంటారు. అయితే శ్రీవల్లి వాంతులు గురించి ఒక వైపు చెప్తున్న సరే వేదవతి నీకేం తెలీదు నువ్వు గమ్మునుండు అనేసి అంటారు. అయినా అత్తయ్య మీరు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు కదా అనేసి నర్మదా అంటుంది. తన కోడలు తల్లి కాబోతుందని చాలా సంతోషంగా ఉంటారు రామరాజు వేదవతి. ఇక వేదవటి భాగ్యం కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తుంది. ఆ విషయం విన్న భాగ్యం ఆనందరావు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి..
Also Read: అక్షయ్ ను గుడ్డిగా నమ్మిన అవని.. ప్రణతికి ద్రోహం చేస్తాడా..? పల్లవి మాస్టర్ ప్లాన్..
మన అమ్మడు తల్లి కాబోతుంది అంట అని ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. వెంటనే మన అమ్మాయిని చూడాలి అని అనుకుంటారు. తర్వాత ఇద్దరు కలిసి గెటప్ లు మార్చుకొని వెళ్ళాలి అని అనుకుంటారు. గెటప్ మార్చుకొని వేసుకొని ఇద్దరూ ఎక్స్ఎల్ మీద జామ్ జామ్ అంటూ కూతురు దగ్గరికి బయలుదేరుతారు.. పాత బండి మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మన బండారం తెలిసిపోతుందని బండిని దాచిపెట్టి ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళ చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. చూశారా అన్నయ్యగారు ఇద్దరు కోడలు ముందు వచ్చిన నా కూతురే మిమ్మల్ని తాత ఏం చేయబోతుంది అని అంటారు. ఈ మాటలు విన్న శ్రీవల్లి అమ్మ నేను తల్లిని కాలేదమ్మా.. ఉప్మా తిని వాంతులు అయ్యాయి అని అసలు విషయం చెప్తుంది. ఆ మాట విన్న వేదవతి సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..