ప్రాణం ఉన్నప్పుడే మనమేంటో నిరూపించుకోవాలని చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రికార్డుల్లోకి ఎక్కాలి అని వారు చేసే పనులు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక స్టార్ సింగర్ ఏకంగా తన అంతిమయాత్రతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ రికార్డును ఎవరూ కూడా ఊహించి ఉండరు అనడంలో సందేహం లేదు. మరి ఆ వ్యక్తి ఎవరు? చనిపోయిన తర్వాత సృష్టించిన ఆ రికార్డు ఏంటి? అసలు ఏం జరిగింది? చనిపోయాక రికార్డులు క్రియేట్ చేయడం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ అస్సామీ స్టార్ సింగర్ జుబిన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన అంతక్రియలు ఈ రోజు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి.. అయితే ఈ గాయకుడి అంత్యక్రియలకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.. ఆయన పాడిన పాటలను పాడుతూ.. ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో జుబీన్ గార్గ్ (Zubeen Garg) అంతిమయాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఏదేమైనా అంతిమయాత్రలో కూడా ఇలా రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఆ తర్వాత స్థానం ఈయనదే..
ఇకపోతే మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్ , క్వీన్ ఎలిజిబెత్ -2 అంత్యక్రియల తర్వాత అత్యధిక జనం పాల్గొన్న అంతిమయాత్రగా ఇది రికార్డు సృష్టించింది.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈయనకు ఇంత పాపులారిటీ ఉందా అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
జుబీన్ గార్గ్ డెత్ సర్టిఫికెట్ పై అనుమానాలు..
ఇదిలా ఉండగా జుబీన్ సింగపూర్లో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతదేహానికి ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ పై అనుమానాలు ఉన్నాయని, మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించనున్నట్లు అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మంగళవారం ఉదయం గుహవాటి వైద్య కళాశాల ఆసుపత్రిలో నిపుణుల బృందం ఈ ప్రక్రియ నిర్వహిస్తుందని కూడా తెలిపారు. “సింగపూర్ లో ఆధునిక వైద్య సాంకేతికతలు అందుబాటులో ఉన్నా.. కానీ కొన్ని వర్గాల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ విషయంలో ఎటువంటి వివాదాన్ని సృష్టించకుండా.. రెండోసారి పోస్ట్ మార్టానికి ఆయన సతీమణి అనుమతి తీసుకున్నామంటూ” సీఎం తెలిపారు.
అంత్యక్రియలు పూర్తి..
ఇకపోతే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ లో భాగంగా ఈనెల 19న సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జుబీన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఆయన మరణానంతరం విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబీన్ ను సింగపూర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాన్ని అస్సాం కు తీసుకొచ్చారు. గువాహటిలోని సరూసజయ్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచగా.. నగర శివారులలో అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
also read:Bigg Boss 9: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!