Postal PPF Scheme: సేవింగ్స్ స్కీమ్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోస్టాఫీస్. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ ఎక్కువ వడ్డీ పొందే సేవింగ్స్ స్కీమ్ ను పోస్టల్ శాఖ అందిస్తుంది. పోస్టల్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. తక్కువ రిస్క్ తో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉండడంతో ఈ పథకంలో పెట్టుబడి పెడుతుంటారు. క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే నిర్ణీత సమయం తర్వాత అధిక మొత్తంలో పొందవచ్చు. అందుకే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కోట్లాది మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో సంవత్సరానికి 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత భారీ మొత్తంలో రిటర్స్న్ వస్తాయి. పీపీఎఫ్ స్కీమ్ లో కేవలం రూ. 500తోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. చిన్న పెట్టుబడిదారులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత కూడా ప్రతి 5 ఏళ్లకు పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంది.
ప్రతి ఏడాది గరిష్టంగా రూ. 1.5 లక్షలు అంటే ప్రతి నెలా సుమారు రూ. 12,500 పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో రూ. 22.5 లక్షలు సేవ్ చేసుకుంటారు. ఈ మొత్తంపై 7.1% వడ్డీతో సుమారు రూ. 18.18 లక్షల వడ్డీ పొందుతారు. అంటే 15 ఏళ్లకు మీరు రూ. 40.68 లక్షల భారీ మొత్తాన్ని పొందవచ్చు. ఈ పెట్టుబడి మొత్తాన్ని తగ్గించవచ్చు లేదా పెంచుకోవచ్చు.
18 ఏళ్లు పైబడిన భారతీయులు అర్హులు
మైనర్లు కూడా ఈ స్కీమ్ తీసుకోవచ్చు. కానీ సంరక్షకుడి ద్వారా ఈ ఖాతా జాయింట్ గా ఓపెన్ చేయవచ్చు.
హిందూ అవిభాజ్య కుటుంబాలు, NRIలు ఖాతాను పొందలేరు.
పీపీఎఫ్ ఖాతాను తెరవడానికి ఈ దశలను ఫాలో అవ్వండి
పోస్టాఫీస్ సిబ్బంది అన్ని వివరాలు తనిఖీ చేసి పీపీఎఫ్ ఖాతా కలిగి ఉన్న పాస్‌బుక్‌ను అందిస్తారు. పీపీఎఫ్ దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి
పీపీఎఫ్ ఖాతాపై రుణ సౌకర్యం కూడా ఉంది. ఖాతా తెరిచి ఒక ఆర్థిక సంవత్సరం పూర్తైన తరువాత లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసి 5 సంవత్సరాల అయితే మీరు కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే సౌకర్యం ఉంటుంది. చిన్న మొత్తంగా పెట్టుబడి పెట్టి 15 సంవత్సరాల తర్వాత అధిక మొత్తంలో పొందవచ్చు.