Again ED Sends Notice Rana In Betting App Case: హీరో రానా కి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్ కేసులో రానాపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను విచారణకు ఆదేశిస్తూ రెండు రోజులు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే జూలై 23న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఇవాళ రానా విచారణకు రాకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 11న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మంగవారం మరోసారి నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం అంశం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా బెట్టింగ్ యాప్ కేసులో హీరో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచులతో పాటు 29 మందిపై కేసు నమోదైంది. ఇందులో సినీ,టీవీ నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు కూడా ఉన్నారు.
విచారణకు రాలేను..
అయితే ఇటీవల ఈ కేసు విచారణ కోసం హీరో రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రానాను జూలై 23న, ప్రకాశ్ రాజ్ ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న , 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. దీంతో నేడు ఈడీ విచారణకు హాజరకు కావాల్సిన రానా రాలేకపోయాడు. సినిమా షూటింగ్ ల కారణంగా విచారణకు రాలేకపోతున్నట్టు సోమవారం ఈడీకి వివరణ ఇచ్చాడు. దీంతో ఆగష్టు 11న విచారణకు రావాలని ఆదేశిస్తూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. కాగా గా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారని, బెట్టింగ్స్ యాప్ వల్ల లక్షల్లో డబ్బులు కోల్పోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ కేసులు ఎక్కువయ్యాయి.
మొత్తం 29పై కేసు
దీంతో వాటిని ఆరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చర్యలకు దిగారు. దీనికి మద్దుతగా ఆర్టీసీ ఎండీ, మాజీ సీపీ సజ్జనార్ సైతం రంగంలోకి దిగి అవగాహన చర్యలు చేపట్టారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సామాన్య ప్రజలను బెట్టింగ్స్ పాల్పడేలా ప్రభావితం చేస్తున్న సెలబ్రిటీలపై కేసులు పెట్టారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి చేసిన పలువురు సినీ తారలు, టీవీ యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లపై హైదరాబాద్ లో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రకాశ్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, యాంకర్ శ్యామలతో పాటు పలువురిపై మియాపూర్ పోలీసు స్టేషన్ కేసు నమోదైంది. విష్ణు ప్రియ, రితూ చౌదరి, టేస్టీ తేజ, సావిత్ర, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, నీతూ అగర్వాల, అమ్రతి చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన ఖాన్, హర్ష సాయి, సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపై కేసు నమోదైంది.
Also Read: Adivi Sesh Dacoit Movie : షూటింగ్ సెట్ లో ప్రమాదం.. హీరో, హీరోయిన్‌కు గాయాలు