BSF Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, టెన్త్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి 3588 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 26 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 24న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3588 (కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ (మేల్): 3406 పోస్టులు, కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ (ఫిమేల్): 182 పోస్టులు)
బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 26
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 24
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి అర్హత ఉన్న వారు వెంటనే జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు..
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bsf.gov.in/
అర్హత ఉండి ఆసక్తి గల వారు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంది. నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి అర్హత ఉన్న వారు వెంటనే జులై 26 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3588
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 24
ALSO READ: MTS notification: 1075 ఉద్యోగాలకు అప్లై చేశారా..? రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ALSO READ: BHEL Recruitment: 65,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే?