Jr NTR Counter to Nandamuri Family: నందమూరి కుటుంబం అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది నటవారసులు ఇండస్ట్రీకి వచ్చారు. దివంగత నటులు, సినీయర్ ఎన్టీఆర్ నటవారసులుగా నందమూరి బాలకృష్ణ, నందమరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నా.. కొత్తగా కూడా ఆయన వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఎంతమంది ఉన్న.. నందమూరి హీరోలంటే ముందుకు గుర్తొచ్చేది బాలయ్య, ఎన్టీఆర్‌ల పేర్లు. మొన్నటి వరకు వీరంత కలిసే ఉన్నారు. బాబాయ్-అబ్బాయ్ అంటూ ఎంతో అనుబంధంతో కనిపించారు.
బాబాయ్-అబ్బాయ్ కి ఏమైందీ..
కానీ, ఈ మధ్య ఎన్టీఆర్, బాలయ్య మధ్య మాటలు లేనట్టుగా అనిపిస్తోంది. వీరు తీరు చూస్తే ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో తారకరత్న మృతి తర్వాత ఇవి స్పష్టంగా కనిపించాయి. తారకరత్న జ్ఞపకార్థం చేసిన కార్యక్రమంలో బాలయ్య.. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లను అసలు పట్టించుకోనట్టు కనిపించాడు. వారిని పలకరించ లేదు. తారక్, కళ్యాణ్ లు పలకరించే ప్రయత్నం చేసిన.. వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.దీంతో బాబాయ్-అబ్బాయ్ మధ్య మాటలు లేవని అర్థమైంది. పలు ఈవెంట్స్‌లోనూ బాలయ్య వీరి ప్రస్తావన వచ్చినా..అవైయిడ్ చేసినట్టు కనిపించాడు. ఒకరి మూవీ ప్రమోషన్స్‌కి ఒకరు రావడం లేదు. ఇటూ కళ్యాణ్ రామ్ మూవీ ఈవెంట్స్ అయినా బాలయ్య కనిపించడం లేదు. బాబాయ్ మూవీ ఈవెంట్ అయినా, ఫంక్షన్ అయినా అబ్బాయిలు రావడం లేదు.
మొన్న పద్మభూషన్ అవార్డు ప్రదానొత్సవానికి కూడా ఎన్టీఆర్, తారక్‌లు దూరంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో అలా బాలయ్యకు విష్ చేశారు. కానీ, వారి విషెస్‌కి ఆయన స్పందించలేదు. అలా కొద్ది రోజులుగా బాబాయ్-అబ్బాయిలు ఎడమోహం పెడమోహనం అన్నట్టు ఉంటున్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీలో మనస్పర్థలు ఉన్నాయని, బాలయ్య.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను దూరం పెడుతున్నాడంటూ సినీవర్గాల్లో గుసగుసల వినిపిస్తోంది. ఈ విషయాన్ని వారు బయటకు చెప్పకపోయినా.. ఎన్టీఆర్, బాలయ్య తీరు చూస్తుంటే అసలు వారి మధ్య మాటల్లేవ్ అని స్పష్టమౌతోంది. తరచూ తారక్ కూడా పరోక్షంగా తాను నందమూరి వారసుడినే అంటూ నొక్కి చెబుతున్నాడు. మొన్న ఓ ఈవెంట్‌లో సీనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ.. ఎవరూ ఔనన్నా కాదన్నా.. నేను ఆయన వారసుడినే.. ఆయన రక్తాన్నే అంటూ బల్లగుద్దినట్టు చెప్పి పరోక్షంగా నందమూరి ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చాడు.
వార్ 2 డైలాగ్ తో గట్టి కౌంటర్
బాలయ్య బాబాయ్ మా ధైర్యం, ఆయన మాకు అన్ని అన్న తారక్.. ఈ మధ్య అసలు బాబాయ్ ఊసే ఎత్తడం లేదు. కానీ, సందర్భంగా వచ్చినప్పుడల్లా ఆయన ఉద్దేశిస్తూ కౌంటర్లు ఇస్తున్నాడు.రీసెంట్ వార్ 2 ఈవెంట్‌లోనూ ఇలాంటి కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదటి నుంచి తాను ఒంటరిగానే ఉన్నానన్నాడు. తన తొలి సినిమా ప్రారంభోత్సవంలో నాతో మా అమ్మ, ఆన్న తప్ప ఎవరూ లేరన్నారు. అప్పుడు వారు నాతో ఉన్నారు.. ఇప్పుడు మీరంత ఉన్నారని పేర్కొన్నాడు. నందమూరి ఫ్యామిలీ సపోర్టు లేకపోయినా.. మా తాత ఆశీస్సులు ఉంటే చాలు అన్నట్టుగా మాట్లాడి కౌంటర్ ఇచ్చాడు. సినిమాల్లోనూ తారక్ ఓ డైలాగ్ మరోసారి నందమూరి ఫ్యామిలీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వార్ 2 సినిమాలోహృతిక్ రోషన్ తో ఉన్న సీన్‌లో ఓ డైలాగ్ చెప్పాడు. ఒంటరి పోరాటం చేస్తూ.. అందరికీ దూరం అవుతూ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ తారక్ నందమూరి ఫ్యామిలీని కౌంటర్ ఇస్తూ చేశాడంటున్నారు. ఈ డైలాగ్ రాగానే థియేటర్లలో ఫ్యాన్స్ అంత ఈళలు వేయడంతో ఇది హైలెట్‌గా నిలిచింది.